Breaking News

క్రిస్టియానో రొనాల్డో సీక్రెట్స్‌ బట్టబయలు

Published on Mon, 02/20/2023 - 13:36

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానం గణం ఎక్కువే. ఆరడుగుల అందగాడు ఏం తింటాడు, ఫిట్‌నెస్‌ ఎలా మెయింటేన్‌ చేస్తున్నాడన్న సీక్రెట్స్‌ తెలుసుకోవాలని అతన్ని ప్రేమించే అభిమానులకు కుతూహులం ఉండడం సహజం. అంతేకాదు మ్యాచ్‌లో కనిపించిన ప్రతీసారి రొనాల్డో చేతులకు రెండు రింగులు కనిపిస్తాయి. అందులో ఒకటి ఫిట్‌నెస్‌ రింగ్‌ అయితే.. మరొకటి బ్రేస్‌లెట్‌(Bracelet). 

బ్రేస్‌లెట్‌(Bracelet) అనేది తన పర్సనల్‌ కాబట్టి దాని గురించి మాట్లాడుకోనవసరం లేదు. కానీ రొనాల్డో ఫుట్‌ సీక్రెట్‌ ఏంటి.. ఫిట్‌నెస్‌ రింగ్‌ ఎందుకు ధరించాడనే దానిని ఒక వ్యక్తి బట్టబయలు చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రస్తుతం రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్‌-నసర్‌ క్లబ్‌ న్యూట్రిషనిస్ట్‌ జోస్‌ బ్లీసా. స్పానిష్‌ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో ఫుట్‌ సీక్రెట్స్‌తో పాటు అతని ఫిట్‌నెస్‌ రింగ్‌ రహస్యాన్ని పంచుకున్నాడు.

''రొనాల్డో తన ఫుడ్‌లో కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలకు ఎక్కువ చోటిస్తాడు. అతను పాటించే స్ట్రిక్ట్‌ డైట్‌ ఫిట్‌గా ఉంచేందుకు దోహదపడుతుంది. తినే ఆహారాన్ని బట్టి ఆరోజు ఎన్ని కేలరీలు కరిగించాలనేది రొనాల్డో ముందుగానే నిర్ణయించుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే తనను తాను ప్రిపేర్‌ చేసుకుంటాడు. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి.

ప్రస్తుతం రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్‌-నసర్‌ క్లబ్‌లోని ఆటగాళ్లంతా రొనాల్డో కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నారు. దీనివల్ల ఆటగాళ్లలో 90శాతం మార్పు కనిపిస్తోంది. కొవ్వు తక్కువున్న పదార్థాలను తీసుకుంటూ ఆటగాళ్లు గంటల తరబడి ఎక్సర్‌సైజులు చేస్తూ తమ ఫిట్‌నెస్‌ను రోజురోజుకు మరింత మెరుగుపరుచుకుంటున్నారు.


అల్‌-నసర్‌ క్లబ్‌ న్యూట్రిషనిస్ట్‌ జోస్‌ బీస్లాతో రొనాల్డో

ఇక రొనాల్డో చేతులకు రెండు రింగులు ఉంటాయి. ఒకటి బ్రేస్‌లెట్‌.. మరొకటి ఫిట్‌నెస్‌ రింగ్‌. ఈ ఫిట్‌నెస్‌ రింగ్‌ రొనాల్డో ఎంతసేపు నిద్రపోతున్నాడు.. ఎంతసేపు ఫిజికల్‌ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉన్నాడనేది లెక్కిస్తుంది. అతను పడుకున్నా, కదలికలు ఉన్నా ఫిట్‌నెస్‌ రింగ్‌ పని చేస్తూనే ఉంటుంది. అంతేకాదు హార్ట్‌బీట్‌తో పాటు శ్వాసరేటను, శరీర ఉష్ణోగ్రతను, కదలికలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇక బ్రేస్‌లెట్‌ అతని పర్సనల్‌ విషయం.. దాని గురించి ఆరా తీయలేదు(నవ్వుతూ)'' ముగించాడు. 

ఇక రొనాల్డో గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పోర్చుగల్‌ జట్టును విజేతగా నిలపడంలో విఫలమైన రొనాల్డో కేవలం ఒకే ఒక్క గోల్‌ కొట్టి దారుణ ప్రదర్శన చేశాడు. అటుపై మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో జరిగిన వివాదం తెగదెంపులకు దారి తీసింది. అయితే రొనాల్డో క్రేజ్‌ మాత్రం ఏం తగ్గలేదు. అల్‌-నసర్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో రొనాల్డో రెండేళ్ల కాలానికి భారీ ఒప్పందం చేసుకున్నాడు. 

చదవండి: 'కనబడుట లేదు'.. ఐపీఎల్‌లో ఆడించేందుకే ఈ డ్రామాలు

Christian Atsu: టర్కీ భూకంపం.. మృత్యువుతో పోరాడి ఓడిన స్టార్‌ ఫుట్‌బాలర్‌

Viswanathan Anand: చదరంగంలో మిస్టర్‌ మేధావి.. తొలి గురువు ఎవరంటే?

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)