Breaking News

కపిల్‌ దేవ్‌ పక్కనున్న దిగ్గజ క్రికెటర్‌ను గుర్తుపట్టారా?

Published on Tue, 07/16/2024 - 19:01

క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలిచిన ఇద్దరు దిగ్గజ కెప్టెన్లను ఒకే ఫ్రేములో చూడటం అభిమానులకు కన్నులపండుగే! అలాంటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇందులో.. భారత్‌కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ను ఈజీగానే గుర్తుపట్టారు నెటిజన్లు. అయితే, ఫొటోలో ఉన్న మరొక వ్యక్తి గురించి మాత్రం నమ్మలేకపోతున్నాం అంటున్నారు.

దిగ్గజ బ్యాటర్‌
ఆయన పూర్వ రూపానికి.. ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం. కపిల్‌ దేవ్‌తో పాటు ఉన్న క్రికెటర్‌ మరెవరో కాదు అర్జున్‌ రణతుంగ. శ్రీలంకను 1996లో వరల్డ్‌కప్‌ విజేతగా నిలిపిన దిగ్గజ బ్యాటర్‌.

శ్రీలంక తరఫున 1982 నుంచి 2000 సంవత్సరం వరకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. మొత్తంగా 93 టెస్టులు, 269 వన్డేలు ఆడిన అర్జున్‌ రణతుంగ ఆయా ఫార్మాట్లలో 5105, 7456 పరుగులు సాధించాడు.

పార్ట్‌టైమ్‌ బౌలర్‌ అయిన ఈ రైటార్మ్‌ మీడియం పేసర్‌ ఖాతాలో టెస్టుల్లో 16, వన్డేల్లో 79 వికెట్లు కూడా ఉన్నాయి. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అర్జున్‌ రణతుంగ రాజకీయాల్లో ప్రవేశించాడు.

శ్రీలంక పార్లమెంట్‌ సభ్యుడిగానూ
శ్రీలంక పార్లమెంట్‌ సభ్యుడిగా ఎంపికై ప్రజాసేవలో భాగమయ్యాడు. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్లు అర్జున్‌ రణతుంగ- కపిల్‌ దేవ్‌ ఫొటో తెరమీదకు రావడం విశేషం.

ఇందులో అర్జున్‌ రణతుంగను చూసిన నెటిజన్లు.. ‘‘90వ దశకంలో ఆయన మ్యాచ్‌లు చూశాం. అసలు ఆయనా ఈయనా ఒక్కరేనా? అస్సలు నమ్మలేకపోతున్నాం. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు’’ అని కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల జూలై 27న తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఈ టూర్‌తో టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ ప్రస్థానం మొదలుకానుంది. 

చదవండి: ‘సంజూకు వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే’

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)