Breaking News

ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌కు గ్లోబల్‌ అంబాసిడర్‌గా కేఎల్‌ రాహుల్‌

Published on Fri, 05/02/2025 - 14:57

ప్రముఖ ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ పాల్‌ & షార్క్‌కు (Paul & Shark) గ్లోబల్‌ అంబాసిడర్‌గా టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాల్‌ & షార్క్‌ సంస్థ యాజమాన్యం ఇవాళ (మే 2) ప్రకటించింది. రాహుల్‌ లాంటి నిష్ణాతుడైన క్రికెటర్‌తో భాగస్వామ్యం పొందడం తమ సంస్థకు గర్వకారణమని పేర్కొంది. రాహుల్‌ పాల్ & షార్క్‌కు గ్లోబల్‌ అంబాసిడర్‌గా ఎంపికైన మొట్టమొదటి భారత అథ్లెట్‌.

పాల్ & షార్క్ అనేది ఇటలీకి చెందిన లగ్జరీ దుస్తుల కంపెనీ. ఈ సంస్థను పాలో డిని అనే వ్యాపారవేత్త 1975లో స్థాపించాడు. దీని ప్రధాన కార్యాలయం​ వారెస్‌లో ఉంది. ఈ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ప్రధానంగా లైఫ్‌స్టైల్ మరియు స్పోర్ట్‌వేర్ దుస్తులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ లోగోపై షార్క్‌ గుర్తు ఉంటుంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 280 స్టోర్లు ఉన్నాయి. పాల్ & షార్క్ భారత్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కంపెనీకి భారత్‌లో ప్రముఖ నగరాల్లో స్టోర్లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ 2025తో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్‌లో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా ఉంటూ, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. 

ఈ జట్టు విజయాల్లో కేఎల్‌ రాహుల్‌ది కీలకపాత్ర. రాహుల్‌ ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడి 53 సగటున, 146.06 స్ట్రయిక్‌రేట్‌తో 371 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌స్కోరర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ మే 5న హైదరాబాద్‌లో జరుగనుంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)