Breaking News

మన ఫుట్‌బాల్‌ సంగతేంటి?

Published on Fri, 12/19/2025 - 03:29

న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్‌ జట్టుపై గురువారం రాజ్యసభలో ఆసక్తికరచర్చ జరిగింది. 1 లక్షా 58 వేల జనాభా మాత్రమే ఉన్న కురసావ్‌ దేశం జట్టు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీకి అర్హత సాధించింది. అయితే 143 కోట్ల జనభా ఉన్న భారత్‌ సంగతేంటని కేరళకు చెందిన కాంగ్రెస్‌ సభ్యులు జోస్‌ కె. మణి రాజ్యసభలో ప్రశ్నించారు. మన ఫుట్‌బాల్‌ జట్టు ప్రగతిపై దీర్ఘకాలిక ప్రణాళికలేవైనా ఉన్నాయా అని కూడా అడిగారు. దీనిపై కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పందిస్తూ కురసావ్‌ దేశం పేరెత్తకుండా బదులిచ్చారు. 

‘ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధించడం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య (ఫిఫా) నిర్దేశించిన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది’ అని అన్నారు. ఏదైనా ప్రపంచకప్‌ లేదంటే ప్రపంచ చాంపియన్‌íÙప్‌లలో పాల్గొనడానికి, అర్హత సంపాదించడానికి సంబంధిత జాతీయ క్రీడా సమాఖ్య చూసుకోవాల్సిన అంశమని, ఆయా క్రీడల నిర్దిష్ట అభివృద్ధికి సంబంధిత సమాఖ్యలదే బాధ్యతని ఆయన సభకు వివరించారు. 

అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) దేశంలో క్రీడాభివృద్ధికి, ఆదరణ పెంచేందుకు, ప్రతిభగల ఫుట్‌బాలర్లను మరింత సానబెట్టేందుకు, పురుషులు, మహిళల జట్టు ‘ఫిఫా’ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తాయని మంత్రి మాండవీయ వివరించారు. 

తమ ప్రభుత్వ పరంగా ‘ఖేలో ఇండియా’ పేరుతో చేపట్టిన బృహత్తర కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన అథ్లెట్లు ఎందరో వెలుగులోకి వచ్చారని, 20 వేల పైచిలుకు క్రీడాకారులు ఈ ఖేలో ఇండియాతో ప్రయోజనం పొందారని చర్చ సందర్భంగా జవాబిచ్చారు. దేశంలో ఉన్న 991 ఖేలో ఇండియా కేంద్రాల్లో 28,214 మంది క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని చెప్పారు.   

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)