టీమిండియాకు బిగ్‌ షాక్‌.. స్టార్‌ బ్యాటర్‌కు గాయం

Published on Tue, 06/18/2024 - 09:51

టీ20 వరల్డ్‌కప్‌-2024 గ్రూపు స్టేజిలో అదరగొట్టిన టీమిండియా.. ఇప్పుడు సూపర్‌-8 పోరుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కరేబియన్‌ దీవుల్లో అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది.

లీగ్‌ స్టేజిలో కనబరిచిన జోరునే సూపర్‌-8 రౌండ్‌లో కొనసాగించాలని రోహిత్‌ సేన భావిస్తోంది. సూపర్‌-8లో భాగంగా భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో జూన్‌ 20న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది.

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ నెట్‌ ప్రాక్టీస్‌ గాయపడ్డాడు. త్రోడౌన్స్‌ స్పెషలిస్ట్‌ బౌలింగ్‌ను ప్రాక్టీస్‌ చేస్తుండగా సూర్య చేతికి వేలికి గాయమైంది. బంతి సూర్య కుడి చేతి వేలికి బలంగా తాకినట్లు తెలుస్తోంది. 

అయితే మ్యాజిక్ స్ప్రే చేసిన తర్వాత సూర్య తిరిగి మళ్లీ ప్రాక్టీస్‌ మొదలు పెట్టినట్లు  స్పోర్ట్‌స్టాక్ తమ నివేదికలో పేర్కొంది. సూర్య గాయం తీవ్రత ఇంకా తెలియాల్సి ఉంది. కాగా సూర్యకుమార్‌ గాయంపై జట్టు మెనెజ్‌మెంట్‌ గానీ బీసీసీఐ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.
 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)