Breaking News

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్‌

Published on Thu, 07/17/2025 - 19:06

లార్డ్స్ టెస్టులో హార్ట్ బ్రేకింగ్ ఓట‌మి త‌ర్వాత ఆతిథ్య ఇంగ్లండ్‌తో మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరుకు టీమిండియా సిద్ద‌మైంది. మాంచెస్ట‌ర్ వేదిక‌గా భార‌త్‌-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా త‌మ స‌న్నాహాకాల‌ను ప్రారంభించింది. గురువారం ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం నెట్స్‌లో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు.

అర్ష్‌దీప్‌కు గాయం..!
అయితే ఈ మ్యాచ్‌కు ముందు భార‌త జ‌ట్టుకు ఎదురు దెబ్బ త‌గిలింది. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా యువ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ చేతి వేలికి గాయ‌మైన‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా త‌మ రిపోర్ట్‌లో పేర్కొంది. బంతి చేతి వేలికి తాక‌డంతో రక్తం కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో అతడి చేతి వేలికి ఫిజియో టేప్ వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌డెష్కాట్ కూడా ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా భారత్ తరపున ఆడలేదు.

ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైనప్పటికి తొలి మూడు టెస్టులకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఒకవేళ నాలుగో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తే.. అర్ష్‌దీప్‌కు తుది జ‌ట్టులోకి చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంది. కానీ ఇంత‌లోనే అర్ష్‌దీప్ గాయప‌డ‌డం టీమ్‌మెనెజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. మ‌రోవైపు లార్డ్స్ టెస్టులో గాయప‌డిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ లేదు.
చదవండి: సిరాజ్ 3 సిక్సర్లతో గెలిపిస్తాడని అనుకున్నా!.. జోకులు ఆపండి: అశ్విన్‌

Videos

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)