Breaking News

ఆస్ట్రేలియాకు ఓ గుడ్‌ న్యూస్‌.. ఓ బ్యాడ్‌ న్యూస్‌

Published on Tue, 12/09/2025 - 09:37

యాషెస్ సిరీస్ 2025-26లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ హ్యామ్‌స్ట్రింగ్‌, కాలి మడమ గాయం కారణంగా మిగిలిన సిరీస్ మొత్తాన్ని దూర‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని ఆసీస్ హెడ్ కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ధ్రువీక‌రించాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026 స‌మ‌యానికి జోష్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని అత‌డు ఆశాభావం వ్య‌క్తం చేశాడు.

ఈ స్టార్ రైట్ఆర్మ్ పేస‌ర్‌ గ‌త నెల‌లో షెఫీల్డ్ షీల్డ్‌లో న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడుతున్నప్పుడు తొడ కండ‌రాల గాయం బారిన‌ప‌డ్డాడు.. దీంతో మ్యాచ్ మ‌ధ్య‌లోనే హాజిల్‌వుడ్ మైదానాన్ని వీడాడు. అయితే అత‌డి గాయం చిన్న‌దే, యాషెస్ ఆరంభ స‌మ‌యానికి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని అంతా భావించారు. 

కానీ స్కాన్‌లో గాయం తీవ్ర‌మైన‌ది తేలింది. దీంతో అత‌డు మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అయితే అత‌డు తిరిగి ప్రాక్టీస్ మొద‌లు పెట్ట‌డంతో క‌నీసం ఆఖ‌రి మూడు టెస్టుల‌కైనా అందుబాటులో వ‌స్తాడ‌ని టీమ్‌మెనెజ్‌మెంట్ ఆశ‌లు పెట్టుకుంది. కానీ ప్రాక్టీస్ సెష‌న్‌ల‌లో అత‌డి కాలి మ‌డ‌మ‌కు గాయ‌మైంది. దీంతో ఇప్పుడు అత‌డు పూర్తిగా సిరీస్ నుంచే వైదొలిగాడు.

"జోష్ హాజిల్‌వుడ్ దురదృష్టవశాత్తు యాషెస్ సిరీస్ నుంచి త‌ప్పుకొన్నాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేక‌పోయాడు. ఇది నిజంగా చాలా చాలా బాధాకరం. ఈ సిరీస్‌లో అత‌డు కీల‌క పాత్ర పోషిస్తాడ‌ని మేము అనుకున్నాం. హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకునే క్ర‌మంలో కాలి మ‌డ‌మ‌కు గాయ‌మైంది. 

అత‌డు తిరిగి పున‌రావ‌సంకు వెళ్ల‌నుర్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు అందుబాటులోకి వ‌స్తాడ‌ని ఆశిస్తున్నాము అని డోనాల్డ్ పేర్కొన్నాడు. అదేవిధంగా మూడో టెస్టుకు రెగ్యూల‌ర్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ తిరిగి రానున్న‌ట్లు డోనాల్డ్ స్ప‌ష్టం చేశాడు.
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌..!

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)