Ashes Series 2023: గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్‌.. ఇకపై కష్టమే..!

Published on Mon, 07/03/2023 - 13:32

5 మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలింది. రెండో టెస్ట్‌ సందర్భంగా తీవ్రంగా గాయపడిన (కాలు బెణికింది) వారి తురుపు ముక్క, స్టార్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయోన్‌ సిరీస్‌ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. లయోన్‌ లేని లోటు ఆసీస్‌కు ఎదరుదెబ్బగా పరిగణించబడుతుంది. 

లయోన్‌ స్థానంలో సీఏ ఎవరిని కొత్తగా ఎంపిక చేయలేదు. మూడో టెస్ట్‌కు లయోన్‌ స్థానంలో టాడ్‌ మర్ఫీ తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. ఈ ఏడాది బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో మర్ఫీ ప్రతిభను (4 టెస్ట్‌ల్లో 14 వికెట్లు) పరిగణలోకి తీసుకుని సీఏ అతనివైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన మర్ఫీ.. ఆసీస్‌ తరఫున ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడాడు. ఆసీస్‌-ఇంగ్లండ్‌ల మధ్య మూడో టెస్ట్‌ హెడింగ్లే వేదికగా జులై 6 నుంచి మొదలు కానుంది. 

కాగా, రెండో టెస్ట్‌, రెండో రోజు ఆటలో బెన్ డకెట్ క్యాచ్‌ అందుకోబోతూ నాథన్‌ లయోన్‌ కాలు బెణికింది. యాదృచ్చికంగా ఈ మ్యాచ్‌ లయోన్‌కు తన కెరీర్‌లో వరుసగా వందో టెస్ట్‌ మ్యాచ్‌. గాయపడిన అనంతరం లయోన్‌ బరిలోకి దిగనప్పటికీ..నాలుగో రోజు జట్టు కోసం పెద్ద సాహసమే చేశాడు. కుంటుతూనే బ్యాటింగ్‌కు వచ్చి తన జట్టుకు అతి మూల్యమైన పరుగులు సమకూర్చాడు. ఈ మ్యాచ్‌లో లయోన్‌ లేకపోయినా ఆసీస్‌ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. 

స్టోక్స్‌ పోరాటం వృధా..
లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆసీస్‌ అంతిమంగా విజయం సాధించినప్పటికీ.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వారికి ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాపించాడు. వీరోచితమైన ఇన్నింగ్స్‌తో తన జట్టును గెలిపించినంత పని చేశాడు. ఆసీస్‌ నిర్ధేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక్కడే  అద్భుతమైన పోరాటం చేశాడు. జట్టులో డకెట్‌్‌ (83) మినహా మిగతా వారెవ్వరి నుంచి సహకారం​ లభించకపోవడంతో ఇంగ్లండ్‌ 327 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.   

  

Videos

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)