Breaking News

ఆస్ట్రేలియన్‌ ఓపెన్​లో ఊహించని సంఘటన.. జొకోవిచ్ గుడ్‌బై చెప్పేస్తాడా?

Published on Fri, 01/24/2025 - 21:35

వయసుతో సంబంధం లేకుండా ఆడుతూ టెన్నిస్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన 37 ఏళ్ళ నోవాక్ జొకోవిచ్ చివరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్‌లో ప్రేక్షకుల నిరసనల మధ్య నిష్క్రమించడం చాలా బాధాకరం. శుక్రవారం అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో మొదటి సెట్‌ను కోల్పోయిన తర్వాత ఎడమ కాలిలో కండరాల నొప్పుల కారణంగా నిష్క్రమిస్తున్నట్టు  జొకోవిచ్ ప్రకటించాడు. జొకోవిచ్ తొలి సెట్ ను 7-6 (5) తేడాతో కోల్పోయిన అనంతరం  నెట్ చుట్టూ నడిచి జ్వెరెవ్‌కు కరచాలనం చేసి ఓటమి అంకీకరిస్తూ ప్రేక్షకులకు అభివాదం చేసి వెనుదిరిగాడు.

సెర్బియా కు చెందిన  జొకోవిచ్ మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రారంభంలో ఒక సెట్ ని కోల్పోయినప్పటికీ మూడో సీడ్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ విసిరిన సవాలును గట్టిగా ఎదుర్కొని 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో విజేత గా నిలిచి సెమీఫైనల్ కి దూసుకెళ్లాడు.

రికార్డు స్థాయిలో తన పదకొండవ ఆస్ట్రేలియన్ ఓపెన్ కిరీటాన్ని గెలుచుకోవడానికి జొకోవిచ్ తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ చివరికి ఒక అడుగు దూరంలో గాయం కారణంగా తలొగ్గాల్సింది.  జొకోవిచ్ మళ్ళీ   క్వార్టర్ ఫైనల్స్‌ ఆడిన రీతిలోనే  అదే స్పూర్తితో ఆడి గెలుపొంది ఫైనల్ కి దూసుకెళ్తాడని ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు ఆశించారు. ఇందుకోసం వారంతా ఏంతో ఖర్చు పెట్టి స్టేడియం కి వచ్చారు. అయితే జొకోవిచ్ ఈ రీతి లో వైదొలగడం వారికి ఎంతో నిరాశ పరిచింది.  

మ్యాచ్ అనంతరం   జొకోవిచ్ మాట్లాడుతూ, జెరెవ్ కు శుభాకాంక్షలు చెప్పాడు. “సాషాకు శుభాకాంక్షలు, అతను తన మొదటి స్లామ్‌కు సాధించడానికి సంపూర్ణంగా అర్హుడు," అని కితాబు ఇచ్చాడు. గత సంవత్సరం కూడా  జొకోవిచ్   ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో సెమీఫైనల్‌ దశలోనే నిష్క్రమించడం గమనార్హం. 2017 తర్వాత మొదటిసారిగా జొకోవిచ్ ఒక గ్రాండ్ స్లాం కూడా గెలవక పోవడం ఇదే మొదటి సారి. అయితే జొకోవిచ్ గత ఏడాది ఒలింపిక్ స్వర్ణం సాధించడం విశేషం.

ఈ ఏడాదిలో తనకెంతో ఇష్టమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరోసారి సెమిస్ స్థాయి నుంచే వైదొలగడం తో ఇంక జొకోవిచ్ కూడా తన చిరకాల ప్రత్యర్థులైన  ఫెదరర్, రాఫెల్ నాదల్ లాగానే త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అతని అభిమానులు భావిస్తున్నారు. గత కొంత కాలంగా జొకోవిచ్ తండ్రి అతనిని  రిటైర్మెంట్  ప్రకటించమని ఒత్తిడి చేస్తుండటం  గమనార్హం.

"గత కొంత కాలంగా నన్ను టెన్నిస్ నుంచి రిటైర్ చేయించడానికి   నాన్న  ప్రయత్నిస్తున్నారు. టెన్నిస్ లో ఇంకా ఏమి సాధించాలని భావిస్తున్నావ్" అని అయన ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం వల్ల అది అతని శరీరం పై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే జొకోవిచ్ ని అతని తండ్రి రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి చేసున్నానడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకోవడంతో జొకోవిచ్ పై మరింత ఒత్తిడి పెరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు జొకోవిచ్ వంటి అరుదైన ఆటగాడిని ఆ విధంగా గేలి చేయడం మాత్రం ఏ విధంగా సమర్థనీయం కాదు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)