ఆసీస్‌ ప్లేయర్‌ ఊచకోత.. వన్డేల్లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ

Published on Sat, 09/20/2025 - 17:47

ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా భారత మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్‌ 20) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్‌ బెత్‌ మూనీ చెలరేగిపోయింది. కేవలం 57 బంతుల్లో శతకం పూర్తి చేసి, వన్డేల్లో రెండో వేగవంతమైన శతకాన్ని సమం చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 75 బంతులు ఎదుర్కొని 23 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 138 పరుగులు చేసింది.

మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీలు (టాప​-5)
మెగ్‌ లాన్నింగ్‌ (ఆస్ట్రేలియా)- 2012లో న్యూజిలాండ్‌పై 45 బంతుల్లో
బెత్‌ మూనీ (ఆస్ట్రేలియా)- 2025లో భారత్‌పై 57 బంతుల్లో
కరెన్‌ రోల్టన్‌ (ఆస్ట్రేలియా)- 2000లో సౌతాఫ్రికాపై 57 బంతుల్లో
సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌)- 2018లో ఐర్లాండ్‌పై 59 బంతుల్లో
స్మృతి మంధన (భారత్‌)- 2025లో ఐర్లాండ్‌పై 70 బంతుల్లో

మూనీ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ రికార్డు స్కోర్‌ చేసింది. 47.5 ఓవర్లలో ఆ జట్టు 412 పరుగులు చేసి ఆలౌటైంది. మూనీతో పాటు జార్జియా వాల్‌ (81), ఎల్లిస్‌ పెర్రీ (68) సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ చేసిన స్కోర్‌ మహిళల వన్డే క్రికెట్‌లో ఆరో అత్యధికం​. అత్యధిక స్కోర్‌ రికార్డు న్యూజిలాండ్‌ (491/4) పేరిట ఉంది.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు (50) ఆడి ఉంటే మరింత భారీ స్కోర్‌ చేసేది. ఓ దశలో స్కోర్‌ ఈజీగా 450 పరుగులు దాటుతుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు చివర్లో మేల్కోవడంతో అది కుదరలేదు. దీప్తి శర్మ వేసిన ఇన్నింగ్స్‌ 45వ ఓవర్‌లో ఆసీస్‌ 3 వికెట్లు కోల్పోయింది. 

ఆతర్వాత 47వ ఓవర్‌లో ఒకటి, 48వ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోవడంతో ఆసీస్‌ కోటా ఓవర్లు ఆడకుండానే ఇన్నింగ్స్‌ను  ముగించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 413 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే చరిత్రే అవుతుంది.

కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరొకటి గెలిచాయి. ప్రస్తుతం జరుగుతున్నది నిర్ణయాత్మకమైన మూడో వన్డే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)