Breaking News

Indonesia Open: ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ   

Published on Sat, 06/17/2023 - 21:04

జకార్తా: ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 టోర్నీలో భారత పురుషుల డబుల్స్‌ బ్యాడ్మింటన్‌ జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ జోడీ, టాప్‌ సీడ్‌ ఫజర్‌ అల్ఫీయాన్‌–మొహమ్మద్‌ రియాన్‌ అర్దియాంతో (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించిన ఏడో సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం.. ఇవాళ (జూన్‌ 17) జరిగిన సెమీఫైనల్లో అన్‌ సీడెడ్‌ దక్షిణ కొరియా జోడీ కాంగ్‌ మిన్‌ హిక్‌–సియో సెంగ్‌ జె పై 17-21 21-19 21-18 తేడాతో విజయం సాధించింది.

ఈ పోటీలో గంటా 7 నిమిషాల పాటు పోరాడిన భారత ద్వయం.. చెమటోడ్చి కొరియన్‌ పెయిర్‌పై గెలుపొందింది. భారత జోడీ తొలి సెట్‌ కోల్పోయినప్పటికీ.. ఏమాత్రం తగ్గకుండా పోరాడి గెలిచింది. ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం.. ప్రముద్య కుసుమవర్ధన-ఎరేమియా ఎరిక్‌ యోచే రాంబటన్‌ (ఇండొనేసియా)-ఆరోన్‌ చియా-వూయ్‌ ఇక్‌ సోహ్‌ (మలేసియా) జోడీల మధ్య విజేతను ఢీకొంటుంది. కాగా, ప్రస్తుత సీజన్‌లో సాత్విక్‌–చిరాగ్‌ స్విస్‌ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరారు.

చదవండి: సాత్విక్‌–చిరాగ్‌ సంచలనం

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)