Breaking News

Ind Vs Pak: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌

Published on Thu, 08/10/2023 - 04:12

చెన్నై: గత ఏడేళ్లుగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ జట్టు చేతిలో ఓటమి ఎరుగని భారత హాకీ జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 4–0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది.

భారత్‌ తరఫున కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (15వ, 23వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... జుగ్‌రాజ్‌ (36వ ని.లో), ఆకాశ్‌దీప్‌ (55వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్‌లు రాగా ఇందులో మూడింటిని గోల్స్‌గా మలి చింది. ఇతర లీగ్‌ మ్యాచ్‌ల్లో జపాన్‌ 2–1తో చైనాపై, మలేసియా 1–0తో కొరియాపై నెగ్గాయి.  

పాక్‌పై విజయంతో ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో లీగ్‌ దశ ముగిశాక భారత్‌ 13 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. 12 పాయింట్లతో మలేసియా రెండో స్థానంలో, 5 పాయింట్లతో దక్షిణ కొరియా, జపాన్, పాకిస్తాన్‌ సంయుక్తంగా మూడో స్థానంలో, ఒక పాయింట్‌తో చైనా చివరి స్థానంలో నిలిచాయి.

కొరియా, జపాన్, పాక్‌ ఐదు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్‌ అంతరంతో కొరియా, జపాన్‌ జట్లకు సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. దాంతో మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ సెమీఫైనల్‌ చేరలేకపోయింది. శుక్రవారం 5–6 స్థానాల కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో చైనాతో పాకిస్తాన్‌...సెమీఫైనల్స్‌ లో కొరియాతో మలేసియా; జపాన్‌తో భారత్‌ ఆడతాయి. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)