ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా..

Published on Tue, 11/19/2024 - 04:16

రాజ్‌గిర్‌ (బిహార్‌): లీగ్‌ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచిన భారత మహిళల హాకీ జట్టు కీలక సమరానికి సమాయత్తమైంది. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో నేడు మాజీ చాంపియన్‌ జపాన్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ సెమీఫైనల్లో తలపడనుంది. ఇప్పటి వరకు సాధించిన ఫలితాలతో సంబంధం లేకుండా ఈ నాకౌట్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తుంది. 

మరో సెమీఫైనల్లో పారిస్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేత చైనాతో మలేసియా పోటీపడుతుంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో భారత జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. లీగ్‌ దశలో భారత్‌ మొత్తం 26 గోల్స్‌ సాధించి ప్రత్యర్థి జట్లకు కేవలం 2 గోల్స్‌ మాత్రమే సమర్పించుకుంది. ‘డ్రాగ్‌ ఫ్లికర్‌’ దీపిక ఏకంగా 10 గోల్స్‌తో అదరగొట్టింది. సంగీత కుమారి నాలుగు గోల్స్‌... ప్రీతి దూబే మూడు గోల్స్‌ చేశారు. 

లాల్‌రెమ్‌సియామి, మనీషా చౌహాన్, నవ్‌నీత్‌ కౌర్‌ రెండు గోల్స్‌ చొప్పున సాధించారు. ఉదిత, కెప్టెన్‌ సలీమా టెటె, బ్యూటీ డుంగ్‌డుంగ్‌ ఒక్కో గోల్‌ చేశారు. మరోవైపు జపాన్‌ జట్టు ఓవరాల్‌గా 6 గోల్స్‌ మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌ తమ సహజశైలిలో ఆడితే వరుసగా ఆరో విజయంతో ఐదోసారి ఈ టోరీ్నలో టైటిల్‌ పోరుకు చేరుకుంటుంది. 

ఇప్పటి వరకు ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ ఏడుసార్లు జరగ్గా.. భారత జట్టు రెండుసార్లు చాంపియన్‌గా (2016, 2023) నిలిచి, మరో రెండుసార్లు (2013, 2018) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. జపాన్‌ జట్టు మూడుసార్లు (2010, 2013, 2023) ఫైనల్‌కు చేరుకొని ఒకసారి (2010లో) విజేతగా నిలిచి, రెండుసార్లు తుది పోరులో ఓడిపోయింది. ‘మా జట్టు బలాలు ఏంటో, బలహీనతలు ఏంటో సభ్యులందరికీ తెలుసు. మా బలాన్ని మరింత పెంచుకొని, భవిష్యత్‌ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ టోర్నీని వినియోగించు కుంటున్నాం. 

ఇప్పటి వరకైతే భారత జట్టు అద్భుతంగా ఆడింది. అయితే నాకౌట్‌ మ్యాచ్‌ అయినా సెమీఫైనల్లో జపాన్‌ను తక్కువ అంచనా వేయకూడదు’ అని భారత జట్టు హెడ్‌ కోచ్‌ హరేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)