Breaking News

IND vs AUS: అమ్మో పెర్తా? భారత్‌ను భ‌య‌పెడుతున్న గ‌త రికార్డులు

Published on Thu, 11/21/2024 - 20:21

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభానికి సమయం అసన్నమైంది. శుక్రవారం(నవంబర్ 22) పెర్త్ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ మొదలుకానుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. పటిష్టమైన ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై దెబ్బ కొట్టాలంటే భారత్ కచ్చితంగా అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయ్యి ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు.. కంగారుల దూకుడుకు ఎలా అడ్డుకుంటుందోనని అభిమానులు అతృతగా ఎదుచూస్తున్నారు. 

ముఖ్యంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్ కీలకం. ఈ సిరీస్‌లో 4-0 తేడాతో ఆసీస్‌ను ఓడిస్తేనే భారత్ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అవుతోంది. ఇక తొలి టెస్టు జరిగే పెర్త్‌లో భారత్ రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

ఆసీస్‌దే పై చేయి..?
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో టీమిండియాకు పేలవ రికార్డు ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టులు జరిగాయి. అందులో టీమిండియా కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా.. ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివరగా భారత్ 2018 పర్యటనలో ఈ స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 146 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది.

‍బ్యాటింగ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
ఈ ఆప్టస్ స్టేడియంలో టీమిండియా సాధించిన అత్యధిక స్కోర్ 402 పరుగులు. 1977లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు నమోదు చేసింది. ఈ వేదికలో భారత్ అత్యల్ప స్కోర్ 141 పరుగులగా ఉంది. 2018లో ఆసీస్‌తో జరిగిన టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 141 పరుగులకు మెన్ ఇన్ బ్లూ ఆలౌటైంది.

విరాట్ ఒక్క‌డే..
ఈ వేదిక‌లో భార‌త్ నుంచి విరాట్ కోహ్లికి ఒక్క‌డికే మంచి రికార్డు ఉంది. పెర్త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం రెండు టెస్టులు మాత్ర‌మే ఆడిన కోహ్లి.. 259 ప‌రుగులు చేసి లీడింగ్ ర‌న్‌స్కోర‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. ఈ మైదానంలో అత్య‌ధిక  వ్య‌క్తిగ‌త స్కోర్ సాధించిన ప్లేయ‌ర్‌గా సునీల్ గవాస్క‌ర్(127 ప‌రుగులు, 1977లో) ఉన్నారు. అదేవిధంగా ఈ వేదికలో అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో భారత్ నుంచి దిగ్గజం బిషన్ సింగ్ బేడీ(10 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నారు.
చదవండి: విధ్వంసం.. డబుల్ సెంచ‌రీతో చెల‌రేగిన సెహ్వాగ్ కొడుకు


 

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)