Breaking News

Asian Games 2023: భారత్‌ ఖాతాలో 15వ స్వర్ణం

Published on Tue, 10/03/2023 - 19:10

ఏషియన్‌ గేమ్స్‌ 2023లో భారత్‌ పతకాల వేటలో దూసుకుపోతుంది. 5000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఇవాళ (అక్టోబర్‌ 3) పారుల్‌ చౌదరీ స్వర్ణం సాధించడంతో భారత్‌ పతకాల సంఖ్య 69కి (15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు) చేరింది. నిన్న 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన పారుల్‌ గంటల వ్యవధిలో తన స్వర్ణ కలను నెరవేర్చుకుంది. ఈ పతకంతో పారుల్‌ చౌదరీ స్వర్ణం నెగ్గిన మూడో భారత ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా నిలిచింది. 

5000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో తొలుత వెనుకపడిన పారుల్‌, ఆతర్వాత అనూహ్యంగ పుంజుకుని 15:14.75 సెకెన్లలో రేసును ముగించింది. ఈ ఈవెంట్‌లో జపాన్‌ అథ్లెట్‌ రిరికా హిరోనాకాకు (15:15.34) రజత పతకం లభించగా.. కజకిస్తాన్‌ అథ్లెట్‌ కరోలిన్‌ కిప్కిరుయ్‌కు (15:23.12) కాంస్యం దక్కింది. ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్‌ అంకిత (15:33.03) ఐదో స్థానంలో నిలిచింది. 

ఇదిలా ఉంటే, 69 పతకాలతో భారత్‌ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 292 పతకాలతో (159 గోల్డ్‌, 87 సిల్వర్‌, 46 బ్రాంజ్‌) చైనా అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 129 పతకాలతో (33, 46, 50) జపాన్‌ రెండో స్థానంలో, 138 పతకాలతో (32, 42, 64) జపాన్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)