Breaking News

రష్మిక అదుర్స్‌

Published on Thu, 04/10/2025 - 03:59

పుణే: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత్‌ ఖాతాలో తొలి విజయం చేరింది. తొలి రోజు మంగళవారం న్యూజిలాండ్‌ చేతిలో 1–2తో ఓడిపోయిన భారత్‌ వెంటనే తేరుకుంది. బుధవారం థాయ్‌లాండ్‌ జట్టుతో జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 2–1తో గెలుపొందింది. భారత్‌కు తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లోనూ శుభారంభం అందించింది. 

ప్రపంచ 170వ ర్యాంకర్‌ లానియానా తారారుడి (థాయ్‌లాండ్‌)తో జరిగిన తొలి సింగిల్స్‌లో ప్రపంచ 345వ ర్యాంకర్‌ రష్మిక 6–2, 6–4తో సంచలన విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. రెండో మ్యాచ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో హైదరాబాద్‌ అమ్మాయి సహజ యామలపల్లి మూడో సెట్‌లో గాయం కారణంగా వైదొలిగింది. 

మనాన్‌చాయ (థాయ్‌లాండ్‌)తో జరిగిన మ్యాచ్‌లో సహజ తొలి సెట్‌ను 3–6తో కోల్పోయింది. రెండో సెట్‌ను టైబ్రేక్‌లో 7–6 (7/3)తో సొంతం చేసుకుంది. మూడో సెట్‌లో సహజ 0–1తో వెనుకబడిన దశలో గాయం కారణంగా ఆమె తప్పుకుంది. ఫలితంగా థాయ్‌లాండ్‌ స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే ద్వయం సత్తా చాటుకుంది. పీంగ్‌టార్న్‌–పట్‌చారిన్‌ (థాయ్‌లాండ్‌) ద్వయంతో జరిగిన డబుల్స్‌ మ్యాచ్‌లో అంకిత–ప్రార్థన 7–6 (7/3), 3–6, 10–3తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో గెలిచి భారత్‌కు 2–1తో విజయాన్ని ఖరారు చేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)