Breaking News

సుజీత్‌కు స్వర్ణ పతకం 

Published on Tue, 10/28/2025 - 05:21

నోవిసాద్‌ (సెర్బియా): ప్రపంచ అండర్‌–23 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ సుజీత్‌ కల్కాల్‌ స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం రాత్రి జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగం ఫైనల్లో 22 ఏళ్ల సుజీత్‌ 10–0 పాయింట్ల తేడాతో ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో ఉమిద్‌జాన్‌ జలోలోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలుపొందాడు. నిర్ణీత ఆరు నిమిషాల్లో... 4 నిమిషాల 53 సెకన్లు ముగిసిన దశలో సుజీత్‌ తన ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించాడు. దాంతో నిబంధనల ప్రకారం రిఫరీ 
బౌట్‌ను నిలిపివేసి సుజీత్‌ను విజేతగా ప్రకటించారు. 

అండర్‌–23 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మూడో భారతీయ రెజ్లర్‌గా సుజీత్‌ గుర్తింపు పొందాడు. 2022లో అమన్‌ సెహ్రావత్‌ (57 కేజీలు), 2024లో చిరాగ్‌ చికారా (57 కేజీలు) భారత్‌కు పసిడి పతకాలు అందించారు. తాజా ప్రదర్శనతో సుజీత్‌ తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. సుజీత్‌ 2022, 2025లలో ఆసియా అండర్‌–23 చాంపియన్‌షిప్‌లో, 2022లో ఆసియా అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)