Breaking News

వార్మప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత మహిళల జట్టు విజయం

Published on Sun, 09/28/2025 - 04:12

బెంగళూరు: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన టీమిండియా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. మొదట న్యూజిలాండ్‌ జట్టు 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 44 ఓవర్లకు కుదించగా... ఆ తర్వాత మరో రెండు ఓవర్లు తగ్గించారు. 

కివీస్‌ కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (54 బంతుల్లో 54; 9 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... మ్యాడీ గ్రీన్‌ (49 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), అమేలియా కెర్‌ (40; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ఆంధ్ర స్పిన్నర్‌ శ్రీ చరణి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత లక్ష్యాన్ని 42 ఓవర్లలో 237 పరుగులుగా నిర్ణయించగా... హర్మన్‌ బృందం 40.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. 

హర్లీన్‌ డియోల్‌ (79 బంతుల్లో 74; 10 ఫోర్లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (86 బంతుల్లో 69; 8 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. గువాహటి వేదికగా మంగళవారం జరగనున్న ప్రపంచకప్‌ తొలి పోరులో శ్రీలంకతో భారత్‌ తలపడనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)