Breaking News

పరాజయం పలకరిస్తోంది!

Published on Sun, 03/08/2026 - 03:43

పెర్త్‌: భారత మహిళల జట్టు ఏకైక డే అండ్‌ నైట్‌ టెస్టులో పరాజయం దిశగా పయనిస్తోంది. రెండో రోజే ఆ్రస్టేలియా మహిళల జట్టు మ్యాచ్‌నే శాసించే స్థితిలో నిలిచింది. మొదట బ్యాట్‌తో, తర్వాత బంతితో హర్మన్‌ప్రీత్‌ బృందాన్ని ఆటాడుకుంది. దీంతో నాలుగు రోజుల ‘పింక్‌ బాల్‌’ టెస్టును మూడు రోజుల్లోనే ముగించేందుకు సిద్ధమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 96/3తో శనివారం ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 90.4 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. 

క్రితంరోజు బ్యాటర్లు అనాబెల్‌ సదర్లాండ్‌ (129; 17 ఫోర్లు) ‘శత’క్కొట్టగా, ఎలీస్‌ పెరీ (76; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించింది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో సయాలీ సత్గరే 4 వికెట్లు, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్‌ ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. స్మృతి మంధాన (2), షఫాలీ వర్మ (5), జెమీమా రోడ్రిగ్స్‌ (14), కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ (11)లతో కూడిన ప్రధాన బ్యాటింగ్‌ బలగమంతా ని్రష్కమించింది. ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవాలంటే భారత జట్టు మరో 20 పరుగులు సాధించాలి.  

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 198; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌: జార్జియా వోల్‌ (బి) సయాలీ 2; ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (సి) జెమీమా (బి) క్రాంతి 9; పెరీ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 76; అలీసా హీలీ (సి) జెమీమా (బి) సయాలీ 13; అనాబెల్‌ సదర్లాండ్‌ (సి) హర్మన్‌ప్రీత్‌ (బి) దీప్తి 129; బెత్‌ మూనీ (సి) జెమీమా (బి) స్నేహ్‌ రాణా 19; యాష్లీ గార్డ్‌నర్‌ (బి) క్రాంతి 1; తాలియా (సి) స్మృతి మంధాన (బి) షఫాలీ 13; అలానా కింగ్‌ (సి) స్నేహ్‌ రాణా (బి) సయాలీ 21; లూసీ హామిల్టన్‌ (సి) స్నేహ్‌ రాణా (బి) సయాలీ 23; డార్సీ బ్రౌన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (90.4 ఓవర్లలో ఆలౌట్‌) 323. వికెట్ల పతనం: 1–2, 2–31, 3–58, 4–186, 5–240, 6–241, 7–273, 8–277, 9–311, 10–323. బౌలింగ్‌: సయాలీ 18.4–2–50–4, క్రాంతి గౌడ్‌ 22–5–72–2, కాశ్వీ గౌతమ్‌ 11–1–46–0, స్నేహ్‌ రాణా 17–1–64–1, దీప్తి శర్మ 17–1–67–2, షఫాలీ 5–2–12–1. 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: స్మృతి (బి) డార్సీ బ్రౌన్‌ 2; షఫాలీ (సి) బెత్‌ మూనీ (బి) లూసీ 5; ప్రతీక (బ్యాటింగ్‌) 43; జెమీమా (సి) బెత్‌ మూనీ (బి) సదర్లాండ్‌ 14; హర్మన్‌ప్రీత్‌ (సి) లూసీ (బి) సదర్లాండ్‌ 11; దీప్తి శర్మ (బి) లూసీ 9; రిచా ఘోష్‌ (సి) బెత్‌ మూనీ (బి) లూసీ 0; స్నేహ్‌ రాణా (బ్యాటింగ్‌) 14; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (29 ఓవర్లలో 6 వికెట్లకు) 105. బౌలింగ్‌: 1–2, 2–10, 3–38, 4–64, 5–82, 6–82. బౌలింగ్‌: డార్సీ బ్రౌన్‌ 9–1–37–1, లూసీ హామిల్టన్‌ 8–1–32–3, అనాబెల్‌ సదర్లాండ్‌ 6–2–15–2, తాలియా 6–1–15–0.  

1 వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా అనాబెల్‌ రికార్డు నెలకొల్పింది. భారత్‌తో టెస్టుకంటే ముందు దక్షిణాఫ్రికాపై (210; 2024లో), ఇంగ్లండ్‌పై (163; 2025లో) అనాబెల్‌ సెంచరీలు సాధించింది. 
అనాబెల్‌ తన తొలి సెంచరీని 2023లో ఇంగ్లండ్‌పై (137 నాటౌట్‌) నమోదు చేసింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)