లెక్క సరిచేసేందుకు...

Published on Sun, 04/19/2026 - 05:00

డర్బన్‌: దక్షిణాఫ్రికా పర్యటనను పరాజయంతో ప్రారంభించిన భారత మహిళల క్రికెట్‌ జట్టు... నేడు రెండో మ్యాచ్‌ ఆడనుంది. టి20 ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేయాలని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం భావిస్తోంది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడింది. భారత జట్టు నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

భారత ఇన్నింగ్స్‌లో హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ ఫర్వాలేదనిపించగా... స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన, రిచా ఘోష్‌ విఫలమయ్యారు. ఒక దశలో పటిష్ట స్థితిలో కనిపించిన టీమిండియా... జోరు పెంచాల్సిన దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. అనంతరం బౌలింగ్‌లోనూ ఎలాంటి మ్యాజిక్‌ చేయలేక ఓటమి వైపు నిలిచింది. 

అయితే తొలి మ్యాచ్‌ లోపాలను సరిదిద్దుకొని ఈ మ్యాచ్‌లో సమష్టిగా సత్తా చాటేందుకు టీమిండియా రెడీ అయింది. బౌలింగ్‌లో తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతి రెడ్డి తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించగా... వీరితో పాటు సీనియర్‌ బౌలర్లు దీప్తి శర్మ, రేణుక సింగ్‌ కలిసికట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. ఇటీవల ఆ్రస్టేలియా, శ్రీలంకపై టి20 సిరీస్‌లు గెలిచిన టీమిండియా... నెల రోజుల విశ్రాంతి అనంతరం సఫారీ పర్యటనకు వెళ్లింది. 

తొలి మ్యాచ్‌ ఫ్లడ్‌లైట్‌ల వెలుతురులో జరగగా... ఆదివారం ‘డే మ్యాచ్‌’ నిర్వహించనున్నారు. మరోవైపు గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఆతిథ్య సఫారీ జట్టు అదే జోరు కొనసాగిస్తూ సిరీస్‌లో మరింత ముందంజ వేయాలని చూస్తోంది. కెప్టెన్‌ వోల్‌వార్ట్‌తో పాటు, డెర్క్‌సన్, బ్రిట్స్, లుస్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. సఫారీ బ్యాటర్లను మన బౌలర్లు ఏమాత్రం కట్టడి చేస్తారనే దానిపైనే మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)