Breaking News

65 నుంచి 40కు...

Published on Thu, 04/03/2025 - 04:39

బెంగళూరు: గత రెండు వారాలుగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) సెంటర్‌లో భారత మహిళల హాకీ ప్రాబబుల్స్‌కు శిక్షణ శిబిరం జరిగింది. ఈ తొలి విడత శిబిరంలో మొత్తం 65 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వారు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రెండో దశ శిబిరం కోసం జాబితాను 40 మందికి కుదించారు. 

28 మంది సీనియర్‌ ప్లేయర్లు కోర్‌ గ్రూప్‌ ప్రాబబుల్స్‌లో తమ చోటును నిలబెట్టుకోగా... జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో రాణించిన 12 మంది కొత్త ప్లేయర్లను ఎంపిక చేశారు. ‘కొత్తగా ఎంపికైన యువ క్రీడాకారిణులు రెండో దశ శిబిరంలో ఎలా రాణిస్తారో ఆసక్తితో ఉన్నాను. ఇందులో ఆకట్టుకుంటే వారు తమ కెరీర్‌లో మరో మెట్టు ఎక్కుతారు’ అని భారత మహిళల హాకీ జట్టు హెడ్‌ కోచ్‌ హరేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. 

భారత మహిళల హాకీ కోర్‌ గ్రూప్‌ ప్రాబబుల్స్‌: సవిత పూనియా, బిచ్చూ దేవి, బన్సారి సోలంకి, మాధురి కిండో, సమీక్ష సక్సేనా (గోల్‌కీపర్లు). మహిమా చౌధరీ, నిక్కీ ప్రధాన్, సుశీలా చాను, ఉదిత, ఇషికా చౌధరీ, జ్యోతి ఛత్రి, జ్యోతి, అక్షత ధెఖాలే, అంజన డుంగ్‌డుంగ్, సుమన్‌ దేవి (డిఫెండర్స్‌). 

సుజాత కుజుర్, వైష్ణవి ఫాలే్క, నేహా, సలీమా టెటె, మనీషా చౌహాన్, అజ్మీనా కుజుర్, సునెలితా టొప్పో, లాల్‌రెమ్‌సియామి, షర్మిలా దేవి, బల్జీత్‌ కౌర్, మహిమా టెటె, అల్బెలా రాణి టొప్పో, పూజా యాదవ్‌ (మిడ్‌ ఫీల్డర్స్‌). దీపిమోనిక టొప్పో, హృతిక సింగ్, దీపిక సొరెంగ్, నవ్‌నీత్‌ కౌర్, సంగీత, దీపిక, రుతుజా, బ్యూటీ డుంగ్‌డుంగ్, ముంతాజ్‌ ఖాన్, అన్ను, చందన జగదీశ్, కాజల్‌ అటా్పడ్కర్‌ (ఫార్వర్డ్స్‌).

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)