Breaking News

సత్తా చాటిన భారత అమ్మాయిలు

Published on Sun, 07/06/2025 - 04:12

చియాంగ్‌ మై (థాయిలాండ్‌):  భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు అసలు సమయంలో చెలరేగింది. క్వాలిఫయింగ్‌ టోర్నీలో సత్తా చాటి ఆసియా కప్‌కు అర్హత సాధించింది. 2003 తర్వాత మన మహిళలు ఆసియా కప్‌ నేరుగా అర్హత సాధించడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2–1 గోల్స్‌ తేడాతో ఆతిథ్య జట్టు థాయిలాండ్‌ను ఓడించింది. భారత్‌ తరఫున సంగీత బస్‌ఫోర్‌ రెండు గోల్స్‌ (28వ నిమిషం, 78వ నిమిషం) సాధించడం విశేషం. థాయిలాండ్‌ తరఫున చట్‌చవాన్‌ రాడ్‌థాంగ్‌ ఏకైక గోల్‌ (47వ నిమిషం) నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల మధ్య గోల్‌ వ్యత్యాసం కూడా (+22) కూడా సమానంగా ఉండటంతో ఇరు జట్లూ తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగాయి.  ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత్‌కంటే 24 స్థానాలు ముందున్న థాయిలాండ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే మన అమ్మాయిల పట్టుదలకు విజయం వరించింది. గతంలో భారత్‌ ఎప్పుడూ థాయిలాండ్‌ను ఓడించలేదు.  

 క్వాలిఫయింగ్‌ టోర్నీలో గ్రూప్‌ ‘బి’ నుంచి ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ భారత మహిళలు విజయం సాధించి అగ్రస్థానంతో ముందంజ వేయడం విశేషం. టోర్నీలో గత మూడు మ్యాచ్‌లలో ఇరాక్, మంగోలియా, తిమోర్‌ లెస్ట్‌లను భారత్‌ ఓడించింది. ఆసియా కప్‌ టోర్నీ 2026లో ఆస్ట్రేలియాలో జరుగుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)