మహిళల పోరులో పైచేయి ఎవరిదో!

Published on Sun, 02/15/2026 - 02:49

సిడ్నీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు కూడా కీలకమైన టి20 పోరుకు సిద్ధమైంది. భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి సమరం జరుగుతుంది. వన్డే వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత స్వదేశంలో శ్రీలంకతో టి20 సిరీస్‌ ఆడి క్లీన్‌స్వీప్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌ సేన ఇప్పుడు ఒక పెద్ద జట్టుతో ప్రత్యర్థి గడ్డపై తలపడుతోంది. కెపె్టన్‌ హర్మన్‌తో పాటు రెగ్యులర్‌ ఆటగాళ్లు స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ బ్యాటింగ్‌లో చెలరేగితే భారత్‌ పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. 

ముఖ్యంగా డబ్ల్యూపీఎల్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచి అద్భుతమైన ఫామ్‌తో స్మృతి ఈ సిరీస్‌కు సిద్ధమైంది. గత టి20 వరల్డ్‌ కప్‌ తర్వాతి నుంచి 143.54 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధిస్తున్న స్మృతికి ఆసీస్‌ గడ్డపై కూడా మంచి రికార్డు ఉంది. క్రాంతి, అరుంధతి, శ్రీచరణి, శ్రేయాంక, రేణుకా సింగ్‌ బౌలింగ్‌ బాధ్యతలు తీసుకుంటారు. 

మరో వైపు కొత్త కెప్టెన్‌ సోఫీ మోలినే నాయకత్వంలో ఆసీస్‌ బరిలోకి దిగుతోంది. గత 19 టి20 సిరీస్‌లలో ఆ్రస్టేలియా ఒక్కటి మాత్రమే ఓడింది. అలీసా హీలీ ఈ ఫార్మాట్‌నుంచి రిటైరైనా... ఇతర స్టార్లు ఎలైస్‌ పెరీ, సదర్లాండ్, మూనీ, లిచ్‌ఫీల్డ్, వోల్, వేర్‌హామ్‌లకు జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ఉంది.  

ఆ్రస్టేలియాలో భారత పర్యటనను ప్రతీ ఫార్మాట్‌కు వేర్వేరుగా కాకుండా తొలిసారి మూడు ఫార్మాట్‌లలో ప్రదర్శనను బట్టి సిరీస్‌ విజేతను నిర్ణయిస్తారు. 3 టి20, 3 వన్డేలు, ఒక టెస్టు తర్వాత ఇది తేలుతుంది. పరిమిత ఓవర్లలో ఒక విజయానికి 2 పాయింట్లు, టెస్టులో విజయానికి 4 పాయింట్లు...టెస్టు డ్రా అయితే చెరో 2 పాయింట్లు కేటాయిస్తారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)