Breaking News

రెండో టి20లోనూ భారత మహిళల గెలుపు

Published on Wed, 05/01/2024 - 04:16

సిల్హెట్‌: బంగ్లాదేశ్‌ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన రెండో టి20కి వర్షం అంతరాయం కలిగించగా.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌ 19 పరుగులతో బంగ్లాదేశ్‌పై గెలిచింది.

 మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ ముర్షిదా ఖాటున్‌ (49 బంతుల్లో 46; 5 ఫోర్లు) రాణించగా, రీతూ మోని (18 బంతుల్లో 20; 2 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. రాధా యాదవ్‌ 3, శ్రేయాంక, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. 

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు వర్షంతో ఆట నిలిచే సమయానికి 5.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది. భారత్‌ ఓపెనర్‌ షఫాలీ వర్మ (0) డకౌట్‌ కాగా, స్మృతి మంధాన (5 నాటౌట్‌) నింపాదిగా ఆడింది. 

కానీ హేమలత దయాళన్‌ (24 బంతుల్లో 41 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగింది. మైదానం చిత్తడిగా మారడంతో మళ్లీ మ్యాచ్‌ కొనసాగించే అవకాశం లేకపోయింది. హేమలతకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది. 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు