Breaking News

గుకేశ్‌ను నిలువరించిన దివ్య

Published on Sat, 09/13/2025 - 04:06

సమర్‌కండ్‌ (ఉజ్బెకిస్తాన్‌): గ్రాండ్‌ స్విస్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగంలో పోటీపడుతున్న భారత మహిళా గ్రాండ్‌మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌తో శుక్రవారం జరిగిన ఎనిమిదో రౌండ్‌ గేమ్‌ను దివ్య 103 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఇటీవల మహిళల ప్రపంచకప్‌ టోర్నీలో విజేతగా నిలిచిన దివ్య రేటింగ్‌ 2478 పాయింట్లు కాగా... గుకేశ్‌ రేటింగ్‌ 2767 పాయింట్లు. 

ఈ టోర్నీలో వరుసగా మూడు పరాజయాల తర్వాత గుకేశ్‌ ‘డ్రా’తో గట్టెక్కాడు. ఎనిమిదో రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, నిహాల్‌ సరీన్, ప్రజ్ఞానంద, ప్రణవ్, అభిమన్యు పురాణిక్, లియోన్, ఆదిత్య మిట్టల్, రౌనక్‌ సాధ్వాని, నారాయణన్, ఆర్యన్‌ చోప్రా తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... విదిత్, పెంటేల హరికృష్ణ ఓటమి చవిచూశారు. కార్తికేయన్‌ మురళీ మాత్రం విజయాన్ని అందుకున్నాడు. 

మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి తొలి ఓటమి చవిచూసింది. బీబీసారా అసబయేవా (కజకిస్తాన్‌)తో జరిగిన గేమ్‌లో వైశాలి 39 ఎత్తుల్లో ఓడిపోయింది. ఓల్గా గిర్యా (రష్యా)తో జరిగిన గేమ్‌ను ద్రోణవల్లి హారిక 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఎనిమిదో రౌండ్‌ తర్వాత వైశాలి 6 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి రెండో స్థానంలో, హారిక 4.5 పాయింట్లతో 20వ స్థానంలో ఉన్నారు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)