Breaking News

Indian Wells Masters: బోపన్న కొత్త చరిత్ర...

Published on Mon, 03/20/2023 - 04:40

కాలిఫోర్నియా: నాలుగు పదుల వయసు దాటినా తనలో సత్తా తగ్గలేదని భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న మరోసారి నిరూపించుకున్నాడు. ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి బోపన్న పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు.

ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 6–3, 2–6, 10–8తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ వెస్టీ కూల్‌హాఫ్‌ (నెదర్లాండ్స్‌)–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) జోడీని ఓడించింది. ఈ గెలుపుతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. డానియల్‌ నెస్టర్‌ (కెనడా) పేరిట ఉన్న రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. 2015లో నెస్టర్‌ 42 ఏళ్ల వయసులో సిన్సినాటి మాస్టర్స్‌ సిరీస్‌ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు.  

గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసింది. విజేతగా నిలిచిన బోపన్న–ఎబ్డెన్‌ జోడీకి 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 60 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ వెస్లీ కూల్‌హాఫ్‌–నీల్‌ స్కప్‌సీ జంటకు 2,31,660 డాలర్ల (రూ. 1 కోటీ 91 లక్షలు) ప్రైజ్‌మనీ, 600 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

5: బోపన్న కెరీర్‌లో ఇది ఐదో మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌. గతంలో అతను మోంటెకార్లో (2017 లో), మాడ్రిడ్‌ (2015లో), పారిస్‌ ఓపెన్‌ (2012, 2011లో) మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధించాడు. మరో ఐదు మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు.  
24: బోపన్న కెరీర్‌లో ఇది 24వ డబుల్స్‌ టైటిల్‌. ఈ ఏడాది రెండోది. ఈ సీజన్‌లో ఎబ్డెన్‌తోనే కలిసి బోపన్న దోహా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు.   

ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఇండియన్‌ వెల్స్‌ టోర్నీకి టెన్నిస్‌ స్వర్గధామం అని పేరు ఉంది. ఎన్నో ఏళ్లుగా నేను ఈ టోర్నీలో ఆడుతున్నాను. విజేతలెందరినో చూశాను. ఈసారి నేను చాంపియన్‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంది.
–రోహన్‌ బోపన్న
విన్నర్స్‌ ట్రోఫీతో బోపన్న–ఎబ్డెన్‌ జోడీ

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)