Cheteshwar Pujara: పుజారా గుడ్‌బై

Published on Mon, 08/25/2025 - 00:45

న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా... అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆటలోని మూడు ఫార్మాట్ల నుంచి తప్పకుంటున్నట్లు ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. 2010లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన పుజారా... దశాబ్దానికి పైగా సాగిన తన కెరీర్‌లో జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. టెక్నిక్‌కు పెట్టింది పేరైన 37 ఏళ్ల పుజారా కెరీర్‌లో 103 టెస్టులాడి 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

టెస్టుల్లో గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి... ప్రత్యర్థి బౌలర్లను విసిగించడంలో దిట్ట అయిన పుజారా... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. కెరీర్‌లో 5 వన్డేలు ఆడిన పుజారా 51 పరుగులు చేశాడు. 2018–19లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన పుజారా... 2020–21 దాన్ని నిలబెట్టుకోవడంలోనూ తన విలువ చాటుకున్నాడు.

2023లో చివరిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ఆడిన పుజారా... ఆ తర్వాత తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించినా... దేశవాళీ మ్యాచ్‌లకు ఎప్పుడూ దూరంకాని పుజారా జట్టులో తిరిగి చోటు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా... సెలెక్టర్లు మరో అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇక తప్పుకోవడమే ఉత్తమమని ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

ప్రశంసల వెల్లువ... 
స్టార్‌ బ్యాటర్లు కోహ్లి, రోహిత్‌తో పాటు స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ ఏడాదే టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకోగా... ఇప్పుడు పుజారా కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. పుజారా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఓవరాల్‌గా 21,301 పరుగులు చేశాడు. రాహుల్‌ ద్రవిడ్‌ టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకున్న అనంతరం ‘నయా వాల్‌’గా గుర్తింపు పొందిన అతడు... మూడో స్థానంలో బరిలోకి దిగి ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. కెరీర్‌కు వీడ్కోలు పలికిన పుజారాకు అభినందనలు వెల్లువెత్తాయి. 

‘నువ్వు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వెళ్లడం చూసినప్పుడల్లా ఎంతో ధైర్యంగా ఉండేది. ప్రశాంతంగా ఆడే తీరు టెస్టు క్రికెట్‌పై నీ ప్రేమను చూపించేది. చక్కటి టెక్నిక్, అంతకుమించిన ఓర్పు, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కుంటూ జట్టుకు వెన్నెముకగా నిలచేవాడివి. 2018లో ఆ్రస్టేలియాలో టీమిండియా టెస్టు సిరీస్‌ నెగ్గడంలో నీ పాత్ర ఎంతో ఉంది. జీవితంలో కొత్త చాప్టర్‌ మరింత ఆస్వాదించాలని ఆకాంక్షిస్తున్నా’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. టీమిండియా కోచ్‌ గంభీర్, మాజీ ఆటగాళ్లు యువరాజ్, సెహ్వాగ్, లక్ష్మణ్, కుంబ్లే, రవిశాస్త్రితో పాటు బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం రహానే,  గిల్, పుజారాకు అభినందనలు తెలిపారు.

అదే అతిపెద్ద గౌరవం...
అత్యున్నత స్థాయిలో భారత జెర్సీ ధరించడం... జాతీయ గీతం ఆలపించడం... బరిలోకి దిగిన ప్రతిసారీ వంద శాతం ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించడం... ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనుభవాలు. అయితే ప్రతి దానికి ముగింపు అంటూ ఉంటుంది. అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. ఇన్నాళ్ల కెరీర్‌లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘానికి కృతజ్ఞతలు. కెరీర్‌లో ఎదిగేందుకు వారు ఎంతో తోడ్పాటు అందించారు. 

నా మెంటార్‌లు, కోచ్‌లు, ఆధ్యాత్మిక గురువు, ఇలా అందరి సహకారంతోనే ఈ స్థాయికి వచ్చా. సహచర క్రికెటర్లు, సహాయ సిబ్బంది తోడ్పాటు మరవలేనిది. రాజ్‌కోట్‌ నుంచి వచ్చిన ఓ కుర్రాడు భారత జట్టులో భాగం కావాలనే కలను నెరవేర్చుకున్నాడు. ఎన్నో అవకాశాలు దక్కాయి. వాటి ద్వారా ఎంతో అనుభవం సాధించా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. ఇక నుంచి కుటుంబానికి మరింత సమయం కేటాయిస్తా.  – వీడ్కోలు సందేశంలో పుజారా

 –సాక్షి క్రీడా విభాగం 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)