Breaking News

డిసెంబర్‌ 19.. భారత క్రికెట్‌లో ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Published on Thu, 12/19/2024 - 12:53

డిసెంబర్‌ 19.. భారత క్రికెట్‌ చరిత్రలో ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. టెస్ట్‌ క్రికెట్‌లో ఇవాల్టి దినాన టీమిండియా రెండు భిన్నమైన రికార్డులు నమోదు చేసింది. 2016లో ఈ రోజున భారత్‌ టెస్ట్‌ క్రికెట్‌లో తమ అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత (2020లో) మళ్లీ ఇదే రోజున భారత్‌ టెస్ట్‌ ‍క్రికెట్‌లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది.

2016, డిసెంబర్‌ 19న విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్‌పై 7 వికెట్ల నష్టానికి 759 పరుగులు స్కోర్‌ చేసింది. భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో నేటికీ ఇదే అత్యధిక స్కోర్‌. చెన్నై వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో కరుణ్‌ నాయర్‌ అజేయమైన ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసింది. నాటి మ్యాచ్‌లో భారత్‌ ఇంగ్లండ్‌పై ఇ​న్నింగ్స్‌ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

సరిగ్గా నాలుగేళ్ల తర్వాత 2020, డిసెంబర్‌ 19న భారత్‌ టెస్ట్‌ల్లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాటి మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 36 పరుగులకే ఆలౌటైంది. భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్‌. నాటి మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ చేయలేకపోయారు. మయాంక్‌ అగర్వాల్‌ చేసిన 9 పరుగులే టాప్‌ స్కోర్‌గా ఉంది. టెస్ట్‌ల్లో భారత అత్యధిక స్కోర్‌, అత్యల్ప స్కోర్‌ విరాట్‌ కోహ్లి నేతృత్వంలో వచ్చినవే కావడం విశేషం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)