Breaking News

‘సోల్డ్‌ అవుట్‌’ 

Published on Wed, 08/30/2023 - 02:19

న్యూఢిల్లీ: ‘మీరు క్యూలో ఉన్నారు... దయచేసి కాసేపు వేచి ఉండండి’... ఈ కాసేపు కాస్తా గంట నుంచి 10 గంటల వరకు కూడా చూపించింది! చివరకు కొద్ది సేపట్లోనే అది కాస్తా ‘సోల్డ్‌ అవుట్‌’ బోర్డుతో ముగిసింది. వన్డే వరల్డ్‌ కప్‌ టికెట్ల కోసం మంగళవారం ఆన్‌లైన్‌లో ప్రయత్నించిన భారత అభిమానుల్లో ఎక్కువ మందికి ఇదే తరహాలో నిరాశ ఎదురైంది.

భారత్‌ ఆడే 9 లీగ్‌ మ్యాచ్‌లకు సంబంధించి ‘మాస్టర్‌ కార్డ్‌’ వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల నుంచి ‘బుక్‌ మై షో’లో టికెట్లు అందుబాటులో ఉంచారు. అయితే గంటల వ్యవధిలోనే అన్ని మ్యాచ్‌ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు 9 మ్యాచ్‌లకు కూడా ‘సోల్డ్‌ అవుట్‌’ అనే చూపిస్తోంది. నిజానికి గత బుధవారం బీసీసీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం 31 ఆగస్టు నుంచి 3 సెపె్టంబర్‌ వరకు భారత లీగ్‌ మ్యాచ్‌లకు సాధారణ అభిమానుల కోసం దశలవారీగా టికెట్లు అమ్ముతారు.

అయితే ఇప్పుడు ‘సోల్డ్‌ అవుట్‌’ అంటే పూర్తిగా అమ్ముడుపోయాయా లేక పరిమిత సంఖ్యలో ‘మాస్టర్‌ కార్డ్‌’ కోసం అందుబాటులో ఉంచి మిగతా టికెట్లు ఆపి ఉంచారా తెలీదు. అసలు టికెట్ల సంఖ్య విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ ఆయా తేదీల్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే!   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)