Breaking News

హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలో...

Published on Wed, 07/22/2026 - 03:25

న్యూఢిల్లీ: వచ్చే నెలలో నెదర్లాండ్స్‌లో జరిగే పురుషుల ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు డ్రాగ్‌ ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యం వహిస్తాడు. ఆగస్టు 14 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు బరిలో ఉన్నాయి. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. 

గ్రూప్‌ ‘డి’లో ఇంగ్లండ్, పాకిస్తాన్, వేల్స్‌ జట్లతో కలిపి భారత్‌కు చోటు కల్పించారు. ఆగస్టు 15న జరిగే తొలి మ్యాచ్‌లో వేల్స్‌తో భారత్‌ ఆడుతుంది. ఆ తర్వాత 17న ఇంగ్లండ్‌తో, 19న పాకిస్తాన్‌తో భారత్‌ తలపడుతుంది. 1975లో ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత భారత జట్టు మరోసారి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరలేదు. 2023లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. 

భారత పురుషుల హాకీ జట్టు: హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్ ), మోహిత్, సూరజ్‌ కర్కేరా, జర్మన్‌ప్రీత్‌ సింగ్, అమిత్‌ రోహిదాస్, జుగ్‌రాజ్‌ సింగ్, సంజయ్, సుమిత్, యశ్‌దీప్‌ సివాచ్, రాజిందర్‌ సింగ్, ఆదిత్య అర్జున్‌ లలాగే, హార్దిక్‌ సింగ్, మన్‌ప్రీత్‌ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్‌ సాగర్‌ ప్రసాద్, దిల్‌ప్రీత్‌ సింగ్, శిలానంద్‌ లాక్రా, సుఖ్‌జీత్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, అభిషేక్‌.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)