Breaking News

యువ భారత్‌కు కాంస్యం

Published on Thu, 12/11/2025 - 04:04

చెన్నై: సొంతగడ్డపై జరిగిన పురుషుల జూనియర్‌ అండర్‌–21 ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో రోహిత్‌ సారథ్యంలోని యువ భారత జట్టు 4–2 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. భారత్‌ తరఫున అంకిత్‌ పాల్‌ (49వ నిమిషంలో), మన్‌మీత్‌ సింగ్‌ (52వ నిమిషంలో), శార్దానంద్‌ తివారి (57వ నిమిషంలో), అన్‌మోల్‌ ఎక్కా (58వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

అర్జెంటీనా జట్టుకు నికోలస్‌ రోడ్రిగెజ్‌ (3వ నిమిషంలో), సాంటియాగో ఫెర్నాండెజ్‌ (44వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. ఒకదశలో 0–2తో వెనుకబడి ఓటమి వైపు పయనిస్తున్న యువ భారత జట్టు చివరి 11 నిమిషాల్లో ఒక్కసారిగా విజృంభించింది. ఏకంగా నాలుగు గోల్స్‌ చేసి అద్భుత విజయాన్ని సాధించింది. భారత్‌ చేసిన నాలుగు గోల్స్‌లో మూడు పెనాల్టీ కార్నర్‌ల ద్వారా, ఒకటి పెనాల్టీ స్ట్రోక్‌ ద్వారా రావడం విశేషం. 

మ్యాచ్‌ మొత్తంలో భారత్‌కు ఏడు పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్‌... అర్జెంటీనా జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ లభించాయి. 46 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత జట్టు కాంస్య పతకం సాధించడం ఇదే తొలిసారి. 2001లో, 2016లో విజేతగా... 1997లో రన్నరప్‌గా నిలిచిన భారత్‌ 2005, 2021, 2023లలో కాంస్య పతక మ్యాచ్‌ల్లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. నాలుగో ప్రయత్నంలో భారత జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో నెగ్గడం విశేషం.

ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు 
కాంస్య పతకం సాధించిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 5 లక్షలు... కోచింగ్‌ బృందంలోని వారికి రూ. 2 లక్షల 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది. 

జర్మనీ 8వ సారి... 
మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీ జట్టు టైటిల్‌ నిలబెట్టుకుంది. ‘షూటౌట్‌’కు దారితీసిన ఫైనల్లో జర్మనీ 3–2 గోల్స్‌ తేడాతో స్పెయిన్‌ జట్టును ఓడించి ఎనిమిదోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. గతంలో జర్మనీ 1982, 1985, 1989, 1993, 2009, 2013, 2023లలో కూడా విజేతగా నిలిచింది.   

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)