Breaking News

యువ భారత్‌ ‘హ్యాట్రిక్‌’

Published on Thu, 05/29/2025 - 01:34

రొసారియో (అర్జెంటీనా): నాలుగు దేశాల జూనియర్‌ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన యువ భారత్‌... ఆతిథ్య అర్జెంటీనాతో జరిగిన హోరాహోరీ పోరులో షూటౌట్‌లో విజయం సాధించి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 1–1 గోల్స్‌తో సమం కాగా... అనంతరం విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన షూటౌట్‌లో భారత్‌ 2–0తో గెలుపొందింది. 

మ్యాచ్‌లో భారత్‌ తరఫున కనిక (44వ నిమిషంలో) ఏకైక గోల్‌ చేయగా... అర్జెంటీనా తరఫున మిలాగ్రోస్‌ డెల్‌ వాలె (10వ నిమిషంలో) ఒక గోల్‌ చేసింది. అర్జెంటీనా జట్టు తొలి క్వార్టర్‌లోనే గోల్‌ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా... మూడో క్వార్టర్‌లో కనిక గోల్‌తో భారత్‌ స్కోర్లు సమం చేయగలిగింది. షూటౌట్‌లో భారత్‌ తరఫున లాల్‌రిన్‌పుయి, లాల్‌థన్‌ట్లుంగి విజయవంతం అయ్యారు. 

యువ భారత జట్టు కెప్టెన్ నిధి గోల్‌కీపర్‌గా అర్జెంటీనా ప్లేయర్ల దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడంతో భారర్లీ టోర్నమెంట్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసుకుంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం చిలీతో భారత్‌ తలపడుతుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)