Breaking News

టైటిల్‌ పోరుకు భారత్‌

Published on Sat, 10/18/2025 - 04:04

జొహోర్‌ బారు (మలేసియా): సుల్తాన్‌ ఆఫ్‌ జొహోర్‌ కప్‌ అండర్‌–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నీలో భారత జట్టు టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం ఆతిథ్య మలేసియా జట్టుతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో రోహిత్‌ సారథ్యంలోని టీమిండియా 2–1 గోల్స్‌ తేడాతో గెలిచింది. భారత్‌ తరఫున గుర్జోత్‌ సింగ్‌ (22వ నిమిషంలో), ఆనంద్‌ కుష్వాహ (48వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

మలేసియా జట్టుకు నావినేశ్‌ పానికెర్‌ (43వ నిమిషంలో) ఏకైక గోల్‌ అందించాడు. 12వసారి ఈ టోర్నీలో ఆడుతున్న భారత జట్టు రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరడం విశేషం. శుక్రవారం జరిగిన మరో రెండు లీగ్‌ మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. న్యూజిలాండ్‌–బ్రిటన్‌ మ్యాచ్‌ 2–2 గోల్స్‌ వద్ద... ఆస్ట్రేలియా–పాకిస్తాన్‌ మ్యాచ్‌ 3–3 గోల్స్‌ వద్ద ‘డ్రా’ అయ్యాయి. 

ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో శుక్రవారంతో లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాయి. 11 పాయింట్లతో ఆస్ట్రేలియా, 10 పాయింట్లతో భారత్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచి నేడు టైటిల్‌ పోరులో తలపడతాయి. బ్రిటన్‌–పాకిస్తాన్‌ జట్ల మధ్య మూడో స్థానం కోసం మ్యాచ్‌ జరుగుతుంది.    

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)