Breaking News

భారత్‌ శుభారంభం

Published on Sat, 11/29/2025 - 03:25

చెన్నై: సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల జూనియర్‌ ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన పూల్‌ ‘బి’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు 7–0 గోల్స్‌ తేడాతో చిలీ జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున రోషన్‌ కుజుర్‌ (16వ, 21వ నిమిషాల్లో), దిల్‌రాజ్‌ సింగ్‌ (25వ, 34వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చొప్పున చేయగా... అజీత్‌ యాదవ్‌ (35వ నిమిషంలో), అన్‌మోల్‌ ఎక్కా (48వ నిమిషంలో), కెప్టెన్‌ రోహిత్‌ (60వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. 

నేడు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఒమన్‌ జట్టుతో భారత్‌ తలపడుతుంది. చిలీతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న భారత్‌ ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. అయితే ఖాతా తెరవడానికి సమయం తీసుకుంది. తొలి క్వార్టర్‌లో గోల్స్‌ చేసేందుకు వచ్చిన అవకాశాలను భారత్‌ చేజార్చుకుంది. దాంతో తొలి క్వార్టర్‌లో రెండు జట్లు 0–0తో సమంగా నిలిచాయి. రెండో క్వార్టర్‌ మొదలైన తొలి నిమిషంలోనే భారత్‌ ఖాతా తెరిచింది. 

మన్‌మీత్‌ సింగ్‌ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న రోషన్‌ కుజుర్‌ బంతిని లక్ష్యానికి చేర్చాడు. ఆ తర్వాత రోషన్, దిల్‌రాజ్‌ నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేశారు. రెండో క్వార్టర్‌ ముగిసేసరికి భారత్‌ 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లో భారత్‌ మరో మూడు గోల్స్‌ చేసింది. నిమిషం వ్యవధిలో దిల్‌రాజ్, అజీత్‌ ఒక్కో గోల్‌ చేశారు. మూడో క్వార్టర్‌ ముగిసేసరికి భారత్‌ 6–0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. 

చివరి క్వార్టర్‌లో చిలీ రక్షణపంక్తి అప్రమత్తంగా ఉండటంతో భారత్‌ ఒక్క గోల్‌ మాత్రమే చేయగలిగింది. మ్యాచ్‌ ఆఖరి నిమిషంలో కెపె్టన్‌ రోహిత్‌ గోల్‌తో భారత్‌ 7–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది. మ్యాచ్‌ మొత్తంలో భారత్‌కు ఆరు పెనాల్టీ కార్నర్‌లు లభించగా... రెండింటిని గోల్స్‌గా మలిచింది. లభించిన ఒక్క పెనాల్టీ స్ట్రోక్‌ను రోహిత్‌ సది్వనియోగం చేసుకున్నాడు.  

టోర్నీ తొలి రోజు శుక్రవారం జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ ఫలితాలు రావడం విశేషం. మదురైలో జరిగిన పూల్‌ ‘ఎ’ మ్యాచ్‌ల్లో జర్మనీ 4–0తో దక్షిణాఫ్రికాపై, ఐర్లాండ్‌ 4–3తో కెనడాపై గెలిచాయి. పూల్‌ ‘బి’ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ 4–0తో ఒమన్‌ను ఓడించింది. పూల్‌ ‘డి’ మ్యాచ్‌ల్లో బెల్జియం 12–1తో నమీబియాపై, స్పెయిన్‌ 8–0తో ఈజిప్ట్‌పై విజయం సాధించాయి. పూల్‌ ‘సి’ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా 4–1తో జపాన్‌పై, న్యూజిలాండ్‌ 5–3తో చైనాపై గెలిచి శుభారంభం చేశాయి.  

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌