Breaking News

సింగపూర్‌పై 12–0తో గెలిచి ‘సూపర్‌–4’ దశకు భారత్‌

Published on Tue, 09/09/2025 - 04:01

హాంగ్జౌ (చైనా): ఆసియా కప్‌ మహిళల హాకీ టోర్నమెంట్‌ లీగ్‌ దశను భారత జట్టు అజేయంగా ముగించింది. సింగపూర్‌ జట్టుతో సోమవారం జరిగిన పూల్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 12–0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నవ్‌నీత్‌ కౌర్‌ (14వ, 20వ, 28వ నిమిషాల్లో), ముంతాజ్‌ ఖాన్‌ (2వ, 32వ, 39వ నిమిషాల్లో) మూడు గోల్స్‌ చొప్పున చేశారు. 

నేహా (11వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించింది. లాల్‌రెమ్‌సియామి (13వ నిమిషంలో), ఉదిత (29వ నిమిషంలో), షరి్మలా (45వ నిమిషంలో), రుతుజా (53వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 11–0తో నెగ్గిన భారత్‌... జపాన్‌తో రెండో మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకుంది. పూల్‌ ‘బి’లో భారత్, జపాన్‌ జట్లు ఏడు పాయింట్లతో సమంగా నిలిచినా... ఎక్కువ గోల్స్‌ చేసిన భారత్‌కు అగ్రస్థానం ఖాయమైంది. జపాన్‌కు రెండో స్థానం దక్కింది. 

పూల్‌ ‘బి’ నుంచి భారత్, జపాన్‌... పూల్‌ ‘ఎ’ నుంచి చైనా, దక్షిణ కొరియా జట్లు ‘సూపర్‌–4’ దశకు అర్హత సాధించాయి. బుధవారం జరిగే ‘సూపర్‌–4’ మ్యాచ్‌ల్లో కొరియాతో భారత్‌; జపాన్‌తో చైనా తలపడతాయి. ‘సూపర్‌–4’ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత పొందుతాయి. విజేత జట్టు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌ టోరీ్నకి అర్హత సాధిస్తుంది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు