Breaking News

యువ భారత్‌ విజృంభణ

Published on Sun, 11/30/2025 - 02:42

చెన్నై: పురుషుల జూనియర్‌ ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు జోరు సాగుతోంది. తొలి మ్యాచ్‌లో చిలీపై ఘనవిజయం సాధించిన యంగ్‌ ఇండియా... రెండో మ్యాచ్‌లో ఒమన్‌పై విజయఢంకా మోగించింది. పూల్‌ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆతిథ్య భారత జట్టు 17–0 గోల్స్‌ తేడాతో ఒమన్‌ను మట్టికరిపించింది. 

భారత్‌ తరఫున దిల్‌రాజ్‌ సింగ్‌ (29వ, 32వ, 50వ, 58వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో విజృంభించగా... అర్ష్ దీప్‌ సింగ్‌ (4, 33, 40వ నిమిషాల్లో), మన్‌మీత్‌ (17, 26, 36వ నిమిషాల్లో) ‘హ్యాట్రిక్‌’ గోల్స్‌ చేశారు. అజీత్‌ యాదవ్‌ (34, 47వ నిమిషాల్లో), గుర్‌జ్యోత్‌ సింగ్‌ (39, 45వ నిమిషాల్లో) రెండేసి గోల్స్‌ సాధించగా... లువాన్‌ (43వ నిమిషంలో), అన్‌మోల్‌ ఎక్కా (29వ నిమిషంలో), శారదానంద్‌ తివారి (55వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

మ్యాచ్‌ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత్‌... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. తొలి క్వార్టర్‌లో ఒక్క గోల్‌తో సరిపెట్టుకున్న యంగ్‌ఇండియా ఆ తర్వాత గోల్స్‌ వర్షం కురిపించింది.  

ఇతర మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్‌ 11–1 తేడాతో కొరియాపై, ఆ్రస్టేలియా 5–3 తేడాతో బంగ్లాదేశ్‌పై, స్విట్జర్లాండ్‌ 3–2 తేడాతో చిలీపై, జర్మనీ 7–0తో కెనడాపై, దక్షిణాఫ్రికా 2–1తో ఐర్లాండ్‌పై, మలేసియాపై 5–1 ఆ్రస్టియాపై, నెదర్లాండ్స్‌ 5–3 గోల్స్‌ తేడాతో ఇంగ్లండ్‌పై విజయాలు సాధించాయి. తదుపరి పోరులోమంగళవారం స్విట్జర్లాండ్‌తో భారత్‌ తలపడనుంది.  

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)