Breaking News

దీపిక డబుల్‌ ధమాకా

Published on Wed, 11/13/2024 - 03:00

రాజ్‌గిర్‌ (బిహార్‌): ఆసియా మహిళల చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు జోరు కనబరుస్తోంది. తొలి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో మలేసియాను చిత్తు చేసిన భారత జట్టు... రెండో మ్యాచ్‌లో దక్షిణ కొరియాను బోల్తా కొట్టించింది. హోరాహోరీగా సాగిన పోరులో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 3–2 గోల్స్‌ తేడాతో దక్షిణ కొరియాపై గెలుపొందింది. 

మ్యాచ్‌ ముగియడానికి మూడు నిమిషాల ముందు స్ట్రయికర్‌ దీపిక కుమారి పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచడంలో భారత్‌ ఈ టోరీ్నలో వరసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. మన జట్టు తరఫున దీపిక (20వ, 57వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌తో మెరవగా... సంగీత కుమారి (3వ నిమిషంలో) ఒక గోల్‌ చేసింది. కొరియా తరఫున యూరీ లీ (34వ ని.లో), కెపె్టన్‌ ఇన్బి చియోన్‌ (38వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. 

మ్యాచ్‌ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ... దూకుడైన ఆటతో ముందుకు సాగిన భారత్‌... మూడో నిమిషంలోనే సంగీత కుమారి ఫీల్డ్‌ గోల్‌తో ఖాతా తెరిచింది. ఆ తర్వాత రెండో క్వార్టర్‌లో దీపిక మరో ఫీల్డ్‌ గోల్‌ చేయడంతో భారత్‌ 2–0తో సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. అప్పటి వరకు భారత గోల్‌ పోస్ట్‌పై ఒక్కసారి కూడా దాడి చేయలేకపోయిన కొరియా ప్లేయర్లు... మూడో క్వార్టర్స్‌లో నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి స్కోరు సమం చేశారు. 

ఇక అక్కడి నుంచి ఆధిక్యం కోసం ఇరు జట్లు హోరాహోరీగా ప్రయత్నించగా... చివరకు దీపిక  గోల్‌తో భారత్‌ విజయపతాక ఎగరేసింది. మరోవైపు థాయ్‌లాండ్, జపాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’ కాగా... చైనా 5–0తో మలేసియాపై విజయం సాధించింది. తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం థాయ్‌లాండ్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత జట్టు 6 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)