Breaking News

ప్రపంచ ‘బెర్త్‌’ లక్ష్యంగా...

Published on Fri, 08/29/2025 - 01:08

రాజ్‌గిర్‌ (బిహార్‌): వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించాలనే లక్ష్యంతో... నేడు మొదలయ్యే ఆసియా కప్‌లో భారత పురుషుల హాకీ జట్టు బరిలోకి దిగనుంది. ఆసియా కప్‌ విజేత జట్టు ప్రపంచకప్‌ టోర్నీకి నేరుగా అర్హత పొందుతుంది. శుక్రవారం మొదలయ్యే ఆసియా కప్‌ పూల్‌ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో చైనాతో భారత్‌ తలపడుతుంది. ఇటీవల జరిగిన యూరోపియన్‌ అంచె ప్రొలీగ్‌లో భారత్‌ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. 8 మ్యాచ్‌లాడితే ఏకంగా ఏడింట పరాజయాన్నే మూటగట్టుకుంది. 

అయితే తాజా ఆసియా కప్‌ పరిస్థితులను ఐరోపా జట్లు, పరిస్థితులతో పోల్చలేం. కానీ అక్కడ తలెత్తిన లోటుపాట్లను మాత్రం ఇక్కడా కొనసాగిస్తే మాత్రం మూల్యం తప్పదు. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో భారత్‌ డిఫెన్స్‌లో దుర్భేద్యంగా మారాలి. పెనాల్టీ కార్నర్లను గోల్‌గా మలిచే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. గోల్‌కీపింగ్‌ కూడా పటిష్టం కావాలి. రిటైరైన దిగ్గజ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ స్థానంలో ఆడుతున్న కృషన్‌ బహదూర్‌ పాఠక్, సూరజ్‌ కర్కేరా ఇంకా చాలా మెరుగవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. 

ఇలా అన్ని రంగాల్లో మెరుగైతేనే  మేటి జట్లను నిలువరించగలం. యూరోపియన్‌ అంచెలో ఎదురైన పరాజయాల భారాన్ని తగ్గించుకోగలం. మిడ్‌ఫీల్డ్‌లో రాజిందర్‌ సింగ్, రాజ్‌ కుమార్‌ పాల్, మన్‌ప్రీత్,  హార్దిక్‌ సింగ్, వివేక్‌ సాగర్‌లు మరింత బాధ్యత కనబరిస్తేనే ఆసియా కప్‌లో ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధిస్తాం. ఆసియా కప్‌లో భారత్, చైనాలున్న పూల్‌ ‘ఎ’లో జపాన్, కజకిస్తాన్‌ మిగతా జట్లు కాగా... పూల్‌ ‘బి’లో దక్షిణ కొరియా, మలేసియా, బంగ్లాదేశ్, చైనీస్‌ తైపీ జట్లున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)