Breaking News

‘ఇక స్వర్ణంపై గురి’

Published on Wed, 08/06/2025 - 04:14

లక్నో: గత ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకం తన జీవితాన్ని సమూలంగా మార్చివేసిందని భారత యువ రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ అన్నాడు. అదే సమయంలో నిలకడగా రాణించాలనే బాధ్యతను పెంచిందని వెల్లడించాడు. ఒకప్పుడు ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అమన్‌... ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన అనంతరం డబ్బుకు కొదవ లేకుండా పోయిందని అన్నాడు. 

పురుషుల 57 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ ట్రయల్స్‌లో విజయం సాధించిన అనంతరం అమన్‌ తన సాధన తీరును వివరించాడు. విశ్వక్రీడల్లో కాంస్య పతకం గెలిచిన విషయాన్ని మరిచి ప్రపంచ చాంపియన్‌షిప్, లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో పసిడి పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు పేర్కొన్నాడు. పారిస్‌ పతకంతో అమన్‌ జీవితంలో వచ్చిన మార్పుల వివరాలు అతడి మాటల్లోనే...  

విదేశీ టోర్నీల్లో పాల్గొంటా... 
ఒలింపిక్స్‌ తర్వాత విదేశాల్లో శిక్షణ పొందాలని అనుకున్నా... కానీ మనం కోరుకున్నవన్నీ జరగవు కదా. అదే సమయంలో గాయం కావడంతో ఇక ఆ ప్రయత్నాలు విరమించుకున్నా. పారిస్‌ ఒలింపిక్స్‌ పతకం నా భుజాలపై అదనపు భారాన్ని మోపింది. ఒకవేళ నేను పరాజయం పాలైతే... పారిస్‌ పతకంతో వచ్చిన కీర్తి నన్ను చెడగొట్టిందనే విమర్శలు వస్తాయనే ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. 

ఇటీవల పాల్గొన్న రెండు టోర్నీలో ఒక దాంట్లో పతకం సాధించా మరో దాంట్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయా. దాదాపు ఏడాది తర్వాత బరిలోకి దిగడం కూడా అందుకు ఒక కారణం. అయినా నా కోచ్‌లు నమ్మకాన్ని కోల్పోవద్దని సూచించారు. మరింత కఠోర సాధన చేస్తున్నా. విదేశీ రెజ్లర్లను పడగొట్టడం అంత తేలికైన పనేం కాదు. ఆ అంశంపై దృష్టి సారించా. 

వచ్చే నెలలో క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు సన్నద్ధమవుతున్నా. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నా. అయితే బలమైన ప్రత్యర్థులతో తలపడాలంటే... విదేశాలకు వెళ్లక తప్పదు. రష్యా, అమెరికాలో జరిగే టోర్నమెంట్‌లలో పాల్గొని మరింత రాటుదేలాలని భావిస్తున్నా. 

శ్రమకు దక్కిన ఫలితమిది 
విశ్వక్రీడల్లో పతకం సాధించిన తర్వాత నా జీవితం 90 శాతం మారిపోయింది. అంతకుముందు నన్ను ఎవరూ గుర్తించేవారు కాదు. కనీసం మా పక్క వీధిలో వారికి కూడా నేనెవరో తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పారిస్‌ ప్రదర్శనతో ప్రతి ఒక్కరూ నన్ను గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అవన్నీ చూస్తుంటే... నేను దేశం కోసం ఏదో సాధించాననే సంతృప్తి కలుగుతోంది. అయితే అది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. ఏళ్ల తరబడి పడ్డ కష్టానికి దక్కిన ఫలితమది. 

పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు పతకం సాధిస్తానని అసలు ఊహించలేదు. ఆ సమయంలో భారత మహిళా రెజ్లర్లపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. భగవంతుడి దయతో నేను పతకం సాధించగలిగా. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు నాపై అంచనాలు ఎక్కువయ్యాయి. ఎలాంటి ఒత్తిడి లేని సమయంలో కాంస్యం గెలిచిన నేను... ఇప్పుడు స్వర్ణం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. పారిస్‌లో సాధించిన కాంస్య పతకాన్ని నా మనసులో నుంచి తీసేసి తిరిగి కఠోర సాధనపై దృష్టి పెట్టాను.  

కష్టనష్టాలకు ఓర్చి... 
ఒకప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎవరూ లేరు అనుకున్న సమయంలో బంధువుల అండతో సాధన కొనసాగించా. సోదరి గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని... ఒక అన్నగా తన బాగోగులు ఎలా చూసుకోవాలని మదన పడుతుండే వాడిని. ఇప్పుడా చింత లేదు. ఆమె బంగారు భవిష్యత్తుకు కావాల్సినంత సాధించా. ఇప్పుడిక ప్రశాంతంగా ప్రాక్టీస్‌పై దృష్టి సారించొచ్చు. అయితే విజయాన్ని తలకెక్కించుకొని గతాన్ని మర్చిపోయే వ్యక్తిని కాదు నేను. అప్పటికి ఇప్పటికీ నాలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. 

కాకపోతే నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా. ఎందుకంటే ఒలింపిక్‌ పతక విజేతగా ఇప్పుడు అందరి దృష్టి నాపై ఉంటుంది కాబట్టి జాగరుకత అవసరం. ఒలింపిక్స్‌ అనంతరం చాన్నాళ్ల వరకు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దానికి గాయంతో పాటు అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)