Breaking News

మీరా ఔరా అనిపించేనా?

Published on Wed, 08/07/2024 - 03:47

పారిస్‌: మూడేళ్ల క్రితం టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో... పోటీలు ప్రారంభమైన తొలి రోజే భారత్‌కు పతకం అందించి సంబరాల్లో ముంచెత్తిన భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను... బుధవారం ‘పారిస్‌’ క్రీడల బరిలోకి దిగనుంది. 49 కేజీల విభాగంలో గత ఒలింపిక్స్‌లో 202 కేజీలు (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రజతం గెలిచిన మీరాబాయిపై ఈసారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే కొంతకాలంగా ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్న చాను.. ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం. ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో ఇప్పటి వరకు భారత్‌కు రెండు పతకాలు దక్కగా... ఆ రెండూ మహిళా లిఫ్టర్లే గెలిచారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో దిగ్గజ లిఫ్టర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించగా... టోక్యోలో మీరాబాయి రజతం నెగ్గింది. గత ఒలింపిక్స్‌లో మెరుపులు మెరిపించిన మీరాబాయి.. ఆ తర్వాత గాయాల బారిన పడి అదే స్థాయి ప్రదర్శన కొనసాగించలేకపోయింది.

2022 కామన్వెల్త్‌ క్రీడల్లో మాత్రమే 200 కేజీల మార్కు దాటగ లిగింది. ఇక తాజాగా ‘పారిస్‌’ క్రీడల్లో మీరాబాయి ఎంట్రీ వెయిట్‌ 200 కేజీలుగా నమోదు చేసుకుంది. ఒలింపిక్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ హో జీహుయి (చైనా), డెలాక్రజ్‌ (అమెరికా), సురోచన ఖామ్‌బో (థాయ్‌లాండ్‌), మిహేలా కామ్‌బెయి (రొమేనియా) మీరాకన్నా మెరుగైన ఎంట్రీ వెయిట్‌ నమోదు చేసుకున్నారు. ఈసారి పోటీల తీవ్రతను బట్టి చూస్తే.. మీరాబాయి తన అత్యుత్తమ ప్రదర్శన (205 కేజీలు) కనబర్చగలిగితేనే పతకం రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయి. 

చైనా లిఫ్టర్‌ హో జీహుయి మరోసారి స్వర్ణంపై గురి పెట్టింది. మీరాబాయి గాయం నుంచి పూర్తిగా కోలుకుందని కోచ్‌ విజయ్‌ శర్మ పేర్కొన్నారు. ‘మీరా 200 కేజీలు సునాయాసంగా దాటగలదు. టోక్యో ఒలింపిక్స్‌లో ఎత్తిన 202 కేజీల బరువును మించిన ప్రదర్శన చేస్తుంది. సవాలు స్వీకరించేందుకు చాను సిద్ధంగా ఉంది’ అని విజయ్‌ శర్మ అన్నాడు. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)