Breaking News

నిఖత్‌ జరీన్‌కు చుక్కెదురు

Published on Mon, 10/02/2023 - 02:25

కచ్చితంగా స్వర్ణ పతకంతో తిరిగి వస్తుందనుకున్న భారత స్టార్‌ బాక్సర్, ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌కు ఆసియా క్రీడల్లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల విభాగం సెమీఫైనల్లో నిఖత్‌ 2–3తో రక్సత్‌ చుథామట్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ తెలంగాణ బాక్సర్‌ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రక్సత్‌ను అలవోకగా ఓడించిన నిఖత్‌కు ఈసారి గట్టిపోటీ ఎదురైంది.

పక్కా ప్రణాళికతో ఈ బౌట్‌లో దిగిన రక్సత్‌ భారత బాక్సర్‌ను నిలువరించింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు స్వర్ణాలు నెగ్గిన నిఖత్‌ ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. మరోవైపు భారత్‌కే చెందిన పర్వీన్‌ హుడా (63 కేజీలు) సెమీఫైనల్‌ చేరుకొని కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకోవడంతోపాటు పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలకు అర్హత సాధించింది.

క్వార్టర్‌ ఫైనల్లో పర్విన్‌ హుడా 5–0తో తుర్దిబెకోవా సితోరా (ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచింది. అయితే జాస్మిన్‌ (60 కేజీలు) పోరాటం క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. ఉంగ్‌యోంగ్‌ వన్‌ (ఉత్తర కొరియా) సంధించిన పంచ్‌లకు జాస్మిన్‌ తట్టుకోలేకపోయింది. దాంతో రిఫరీ రెండో రౌండ్‌లో బౌట్‌ను ముగించి ఉంగ్‌యోంగ్‌ను విజేతగా ప్రకటించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)