Breaking News

అండర్‌–19 టి20 ప్రపంచకప్‌ భారత జట్టులో త్రిష, ధృతి, షబ్నమ్‌

Published on Wed, 12/25/2024 - 03:17

న్యూఢిల్లీ: వచ్చే నెలలో మలేసియాలో జరిగే అండర్‌–19 మహిళల టి20 ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ముగ్గురు తెలుగు అమ్మాయిలు గొంగడి త్రిష, కేసరి ధృతి (తెలంగాణ), షబ్నమ్‌ (ఆంధ్రప్రదేశ్‌) చోటు దక్కించుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. 

భారత జట్టుకు నిక్కీ ప్రసాద్‌ కెప్టెన్ గా, సనికా చాల్కె వైస్‌ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. 2023లో తొలిసారి నిర్వహించిన మహిళల అండర్‌–19 టి20 ప్రపంచకప్‌లో షఫాలీ వర్మ సారథ్యంలో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. త్రిష, షబ్నమ్‌ నాటి విజేత జట్టులో సభ్యులుగా ఉన్నారు. త్రిష, షబ్నమ్‌లకిది రెండో టి20 ప్రపంచకప్‌ కానుంది. 

గత ఆదివారం కౌలాలంపూర్‌లో జరిగిన ఆసియా కప్‌ అండర్‌–19 టి20 టోర్నీలో భారత జట్టుకు టైటిల్‌ దక్కడంలో త్రిష కీలకపాత్ర పోషించింది. త్రిష ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’తోపాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు గెల్చుకుంది.  టి20 ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా పోటీ పడనున్నాయి. ఆతిథ్య మలేసియా, వెస్టిండీస్, శ్రీలంకతో కలిసి భారత జట్టు గ్రూప్‌ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. 

తమ తొలి మ్యాచ్‌లో భాతర అమ్మాయిల జట్టు జనవరి 19న వెస్టిండీస్‌తో, 21న మలేసియాతో, 23న శ్రీలంకతో తలపడుతుంది. గ్రూప్‌ దశ ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్‌ సిక్స్‌’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్‌ సిక్స్‌’ను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి.   

భారత టి20 జట్టు: నిక్కీ ప్రసాద్‌ (కెప్టెన్ ), సనికా చాల్కె (వైస్‌ కెప్టెన్ ), గొంగడి త్రిష, కమిళిని, భవిక అహిరె, ఈశ్వరి అవసారె, మిథిల, వీజే జోషిత, సోనమ్‌ యాదవ్, పరుణిక సిసోడియా, కేసరి ధృతి, ఆయూషి శుక్లా, అనందిత, షబ్నమ్, వైష్ణవి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)