Breaking News

టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టు ప్రకటన

Published on Tue, 08/27/2024 - 13:18

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ 2024 కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఇవాళ (ఆగస్ట్‌ 27) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఎంపిక కాగా.. వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధన వ్యవహరించనుంది. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ యస్తికా భాటియా, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. ఫిట్‌నెస్‌ ప్రామాణికంగా వారి ఎంపిక జరుగనుంది. 

ఈ జట్టుతో పాటు భారత సెలెక్టర్లు ముగ్గురు ట్రావెలింగ్‌ రిజర్వ్‌లు, ఇద్దరు  నాన్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌లను కూడా ఎంపిక చేశారు. ట్రావెలింగ్‌ రిజర్వ్‌లుగా ఉమా ఛెత్రి (వికెట్‌కీపర్‌), తనూజా కన్వర్‌, సైమా ఠాకూర్‌.. నాన్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌లుగా రాఘవి బిస్త్‌, ప్రియా మిశ్రా ఎంపికయ్యారు.

టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), యాస్తికా భాటియా (వికెట్‌కీపర్‌)*, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్*, సంజన సజీవన్

ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఉమా ఛెత్రీ (వికెట​్‌కీపర్‌), తనూజా కన్వర్, సైమా ఠాకూర్

నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రాఘవి బిస్త్, ప్రియా మిశ్రా

కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్‌ అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్‌ అక్టోబర్‌ 4న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. దుబాయ్‌ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో భారత్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అనంతరం దుబాయ్‌ వేదికగానే అక్టోబర్‌ 6న భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగనుంది. అక్టోబర్‌ 9న శ్రీలంకతో, 13న ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్‌లు ఆడనుంది. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)