Breaking News

ద్యుతీ చంద్‌కు భారీ షాక్‌.. నాలుగేళ్ల నిషేధం! కావాలని చేయలేదు..

Published on Fri, 08/18/2023 - 16:29

4 Years Ban On Dutee Chand: భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌కు భారీ షాక్‌ తగిలింది. డోపింగ్‌ టెస్టులో విఫలమైన ఆమెపై నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(నాడా) నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. గతేడాది డిసెంబరు 5, 26 తేదీల్లో భువనేశ్వర్‌లో నాడాకు చెందిన అధికారులు ద్యుతీ నుంచి రెండుసార్లు శాంపిళ్లు సేకరించారు. 

ఈ క్రమంలో ఆమె శరీరంలో నిషేధిత ఉత్ప్రేరకాల(SARMS) ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో జనవరి 3, 2023 నుంచే ద్యుతీపై నిషేధం అమల్లోకి వస్తుందని నాడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ద్యుతీ చంద్‌ గెలిచిన పతకాలన్నీ వెనక్కి తీసుకోనున్నారు. 

క్లీన్‌చిట్‌ వస్తుంది
ఈ విషయంపై స్పందించిన ద్యుతీ తరఫు న్యాయవాది శుక్రవారం పీటీఐతో మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా ద్యుతీ చంద్‌ ఈ మందులు వాడలేదని తెలిపారు. ఆమె తీసుకున్న ఏజెంట్లు స్పోర్టింగ్‌ అడ్వాంటేజ్‌ ఇవ్వవని చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల నిషేధంపై తాము అప్పీలుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని.. భారత్‌కు గర్వకారణమైన ద్యుతీకి క్లీన్‌చిట్‌ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కడిగిన ఆణిముత్యంలా
‘దశాబ్దకాలంగా ద్యుతీ కెరీర్‌ దేదీప్యమానంగా కొనసాగుతోంది. తన సుదీర్ఘ కెరీర్‌లో.. క్లీన్‌ అథ్లెట్‌ ద్యుతీ.. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొన్ని వందలసార్లు డోపింగ్‌ టెస్టులు ఎదుర్కొని కడిగిన ఆణిముత్యంలా తిరిగి వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది’’అని సదరు న్యాయవాది ద్యుతిపై నమ్మకం ఉంచారు. 

కాగా SARMS(సెలక్టివ్‌ ఆండ్రోజెన్‌ రెసిప్టార్‌ మ్యాడ్యులేటర్స్‌) అనేవి నాన్‌- స్టెరాయిడల్‌ సబ్‌స్టాన్సెన్స్‌. వీటిని సాధారణంగా ఆస్టియోపొరోసిస్‌(కీళ్లు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు), ఎనీమియా(రక్తహీనత) ఉన్న పేషెంట్ల చికిత్సలో వినియోగిస్తారని తెలుస్తోంది.

కాగా 27 ఏళ్ల ద్యుతీ చంద్‌ ఆసియా క్రీడల్లో రెండుసార్లు రజతాలు గెలిచింది. 100 మీటర్ల పరుగు పందెంలో ఇప్పటికీ నేషనల్‌ రికార్డు తన పేరిటే ఉంది. 2011లో ఇండియన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌లో 11.17 సెకన్లలో పరుగు పూర్తి చేసింది ద్యుతీ.

చదవండి: టీమిండియా క్యాప్‌ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్‌! 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌