Breaking News

క్లీన్‌స్వీప్‌...

Published on Fri, 09/26/2025 - 01:30

న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ను భారత షూటర్లు ఘనంగా ప్రారంభించారు. తొలి రోజు భారత షూటర్లు మొత్తం ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. జూనియర్‌ మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. టాప్‌–3లో భారత షూటర్లే నిలిచి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. అనుష్క ఠాకూర్‌ పసిడి పతకం నెగ్గగా... అన్షిక రజత పతకాన్ని, ఆద్య అగర్వాల్‌ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.

 అనుష్క 621.6 పాయింట్లతో అగ్రస్థానంలో, అన్షిక 619.2 పాయింట్లతో రెండో స్థానంలో, ఆద్య 615.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కే చెందిన సానియా 610.9 పాయింట్లతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకోగా... నిమ్రత్‌ కౌర్‌ 604.3 పాయింట్లతో తొమ్మిదో స్థానాన్ని సంపాదించింది. మరోవైపు జూనియర్‌ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. 

దీపేంద్ర సింగ్‌ షెకావత్‌ 617.9 పాయింట్లతో రజత పతకం నెగ్గగా... రోహిత్‌ కన్యాన్‌ 616.3 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. స్వతంత్ర అథ్లెట్‌గా పోటీపడ్డ రష్యా షూటర్‌ కామిల్‌ నురిఖెమెతోవ్‌ 618.9 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)