Breaking News

అనంత్‌ అదరహో...

Published on Thu, 08/21/2025 - 04:13

షిమ్‌కెంట్‌ (కజకిస్తాన్‌):  ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ సీనియర్‌ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. బుధవారం జరిగిన పురుషుల స్కీట్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ అనంత్‌ జీత్‌ సింగ్‌ నరూకా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రాజస్తాన్‌కు చెందిన అనంత్‌కు ఆసియా చాంపియన్‌షిప్‌ చరిత్రలో ఇదే తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం కావడం విశేషం. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 27 ఏళ్ల అనంత్‌ 60 పాయింట్లకుగాను 57 పాయింట్లు స్కోరు చేసి విజేతగా అవతరించాడు. 

ఆసియా క్రీడల చాంపియన్‌ మన్సూర్‌ అల్‌ రషీది (కువైట్‌) 56 పాయింట్లు సాధించి రజత పతకం నెగ్గాడు. 43 పాయింట్లతో అల్‌ ఇషాక్‌ అలీ అహ్మద్‌ (ఖతర్‌) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 46 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో అనంత్‌ 119 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందాడు.క్వాలిఫయింగ్‌లో టాప్‌–6లో నిలిచిన వారికి ఫైనల్‌ బెర్త్‌లు లభిస్తాయి. 

2023 ఆసియా చాంపియన్‌షిప్‌ టీమ్‌ విభాగంలో, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచిన అనంత్‌ హాంగ్జౌ ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో రజతం సాధించాడు. మరోవైపు మహిళల స్కీట్‌ టీమ్‌ విభాగంలో భారత బృందానికి కాంస్య పతకం లభించింది. మహేశ్వరి చౌహాన్‌ (113 పాయింట్లు), గనీమత్‌ సెఖోన్‌ (109 పాయింట్లు), రైజా ధిల్లాన్‌ (107 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు 329 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో మహేశ్వరి చౌహాన్‌ 35 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.  

సురుచి–సౌరభ్‌ జోడీకి కాంస్యం 
ఎయిర్‌ పిస్టల్‌ 10 మీటర్ల మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సురుచి సింగ్‌–సౌరభ్‌ చౌధరీ జోడీ భారత్‌కు కాంస్య పతకం అందించింది. కాంస్య పతక మ్యాచ్‌లో సురుచి–సౌరభ్‌ 17–9 పాయింట్లతో లియు హెంగ్‌ యు–సెయి సియాంగ్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)లపై విజయం సాధించారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో వన్షిక చౌధరీ–జొనాథన్‌ గావిన్‌ ఆంటోనీ ద్వయం భారత్‌ ఖాతాలో స్వర్ణ పతకాన్ని జమ చేసింది. 

ఫైనల్లో వన్షిక–జొనాథన్‌ 16–14తో కిమ్‌ యెజిన్‌–కిమ్‌ డూయోన్‌ (దక్షిణ కొరియా)లపై గెలుపొందింది. సీనియర్, జూనియర్, యూత్‌ విభాగాల్లో కలిపి ప్రస్తుత చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఏడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి 17 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)