ఈ ఏటి మేటి షోలో సామ్రాట్‌ ‘స్వర్ణ’ గురి

Published on Fri, 12/19/2025 - 03:26

న్యూఢిల్లీ: భారత షూటర్‌ సామ్రాట్‌ రాణా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనబరిచిన స్వర్ణ పతక ప్రదర్శనకు అరుదైన గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య  (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) విడుదల చేసిన ఈ ఏడాది మేటి ఐదు ప్రదర్శనల్లో మన షూటర్‌ ఘనత కూడా నిలిచింది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల యువ షూటర్‌ సామ్రాట్‌ గత నెల కైరోలో జరిగిన ఈవెంట్‌లో బంగారు పతకం సాధించాడు. 

పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో అసాధారణ గురితో ‘స్వర్ణ’ధరికి చేరాడు. తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం, సొంత వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి షూటింగ్‌ కేంద్రమే సామ్రాట్‌ను ప్రపంచ చాంపియన్‌గా మలిచింది. ఈ సందర్భంగా ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ సామ్రాట్‌ పసిడి పతక ప్రదర్శనను ఆకాశానికెత్తింది. అద్భుతమని కితాబిచ్చి ంది.  

అక్కడ అతనేం చేశాడంటే... 
పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్స్‌కు సామ్రాట్‌ అర్హత సాధించాడు. కానీ అక్కడ ప్రపంచ నంబర్‌వన్‌ హు కై (చైనా) ఉన్నాడు. పైగా ఈ ఏడాది అతను ఎవరి చేతిలోనూ ఓడలేదు. అలాంటి అజేయ షూటర్‌ స్వర్ణం లక్ష్యంగా బుల్లెట్‌లను ఫైర్‌ చేశాడు. ఇంకో నాలుగైదు షాట్లే మిగిలున్నాయి. 

చైనా షూటర్‌ స్పష్టమైన అధిక్యంలో ఉన్నాడు. ఇలాంటి దశలో ఒత్తిడి లేకుండా సామ్రాట్‌ తన కంటికి లక్ష్యబిందువు తప్ప ఇంకేది కనపడనీయలేదు. ట్రిగ్గర్‌ నొక్కి కచ్చి తత్వంతో కూడిన రెండు వరుస షాట్లు (10.2 పాయింట్లు, 10.6 పాయింట్లు) హరియాణా షూటర్‌కు అసాధారణ విజయాన్ని కట్టబెట్టాయి.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)