Breaking News

T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!

Published on Sat, 06/01/2024 - 13:54

యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా ఇవాల్టి (జూన్‌ 1) నుంచి టీ20 ప్రపంచకప్‌ 2024 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తొలి సారి రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. గతంలో ఈ టోర్నీ 12 జట్లతో సాగేది. క్రికెట్‌ పసికూనలకు ప్రోత్సహించడంలో భాగంగా ఐసీసీ ఈ ఎడిషన్‌ నుంచి 20 జట్లకు అవకాశం కల్పిస్తుంది.

ఈ ఎడిషన్‌ ప్రపంచకప్‌లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈసారి ఏకంగా 15 మంది భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. న్యూజిలాండ్‌ నుంచి ఒక్కరు.. యూఎస్‌ఏ నుంచి ఆరుగురు.. కెనడా నుంచి నలుగురు.. సౌతాఫ్రికా, ఒమన్‌ల నుంచి ఒక్కొక్కరు.. ఉగాండ నుంచి ఇద్దరు చొప్పున ఈ ఎడిషన్‌లో పాల్గొంటున్నారు.

గతంలో ఎన్నడూ ఈ సీజన్‌లో పాల్గొంటున్నంత మంది భారత సంతతి ఆటగాళ్లు పాల్గొనలేదు. ఈ ఎడిషన్‌ ప్రపంచకప్‌లో అందరి కళ్లు న్యూజిలాండ్‌కు చెందిన భారత సంతతి ఆటగాడు రచిన్‌ రవీంద్రపై ఉన్నాయి. అలాగే సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ ప్రదర్శనల కోసం కూడా భారత క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టీ20 ప్రపంచకప్‌ 2024లో పాల్గొంటున్న భారత సంతతి ఆటగాళ్లు..

రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్‌)
కేశవ్‌ మహారాజ్‌ (సౌతాఫ్రికా)
కశ్యప్‌ ప్రజాపతి (ఒమన్‌)
అల్పేశ్‌ రాంజనీ (ఉగాండ)
రోనక్‌ పటేల్‌ (ఉగాండ)
రవీందర్‌ పాల్‌ సింగ్‌ (కెనడా)
నిఖిల్‌ దత్తా (కెనడా)
పర్గత్‌ సింగ్‌ (కెనడా)
శ్రేయస్‌ మొవ్వ (కెనడా)
మోనాంక్‌ పటేల్‌ (యూఎస్‌ఏ)
హార్మీత్‌ సింగ్‌ (యూఎస్‌ఏ)
మిలింద్‌ కుమార్‌ (యూఎస్‌ఏ)
నిసర్గ్‌ పటేల్‌ (యూఎస్‌ఏ)
నితీశ్‌ కుమార్‌ (యూఎస్‌ఏ)
సౌరభ్‌ నేత్రావాల్కర్‌ (యూఎస్‌ఏ)

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు