Breaking News

2036 ఒలింపిక్స్‌ నిర్వహణ భారత్‌లో..?

Published on Tue, 11/05/2024 - 20:27

2036 ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)కి లేఖ (Letter Of Intent) రాసింది. అక్టోబర్‌ 1న ఐఓసీ ఫ్యూచర్‌ హోస్ట్‌ కమీషన్‌కు భారత ఒలింపిక్స్‌ సంఘం లేఖ రాసినట్లు పీటీఐ పేర్కొంది. గతేడాది భారత ప్రధాని నరేంద్ర మోదీ 141వ ఐఓసీ సెషన్‌లో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఒలింపిక్స్‌ నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.

2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులు ఏ దేశానికి దక్కుతాయన్న విషయం వచ్చే ఏడాది తెలుస్తుంది. ఒలింపిక్స్‌ నిర్వహణ విషయంలో భారత్‌కు సౌదీ అరేబియా, ఖతార్‌, టర్కీ, సౌత్‌ కొరియా గట్టి పోటీ ఇస్తున్నాయి. మరోవైపు మెక్సీకో, ఇండోనేషియా, పోలాండ్‌, ఈజిప్ట్‌ కూడా ఒలింపిక్స్‌ నిర్వహణ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా, ఈ ఏడాదే (2024) పారిస్‌లో విశ్వ క్రీడ‌లు ముగిసిన విషయం తెలిసిందే. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్‌లో జ‌రుగ‌బోతున్నాయి. అనంత‌రం ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ వేదిక‌గా 2032 విశ్వ క్రీడలు జరుగనున్నాయి. 2036 ఒలింపిక్స్‌ వేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత దేశ ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ఒలింపిక్స్ నిర్వహణ 140 కోట్ల భారతీయుల కల.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)