భారత్‌కు మరో పరాజయం

Published on Thu, 06/12/2025 - 01:28

అమ్‌స్టెల్వీన్‌ (నెదర్లాండ్స్‌): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిన హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత జట్టు... మూడో మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో కూడా ఓడింది. యూరప్‌ అంచె పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన పోరులో టీమిండియా 3–4 గోల్స్‌ తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. గత రెండు మ్యాచ్‌ల్లో పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో విఫలమైన భారత్‌... ఈసారి పేలవ డిఫెన్స్‌తో మూల్యం చెల్లించుకుంది. 

భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (12వ, 33వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించగా... అభిõÙక్‌ (42వ నిమిషంలో) ఒక గోల్‌ కొట్టాడు. అర్జెంటీనా తరఫున మాటియాస్‌ రే (3వ నిమిషంలో), లూకాస్‌ మార్టినేజ్‌ (17వ నిమిషంలో), శాంటియాగో టరాజొనా (34వ నిమిషంలో), లూకాస్‌ మెండెజ్‌ (46వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. 

భారత డిఫెండర్ల తప్పిదంతో ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే కెప్టెన్‌ మాటియాస్‌ రే అర్జెంటీనా ఖాతా తెరిచాడు. హర్మన్‌ప్రీత్‌ గోల్‌తో టీమిండియా స్కోరు సమం చేసినా... మన రక్షణ పంక్తి పదే పదే తప్పిదాలకు పాల్పడటంతో అర్జెంటీనా దూకుడు పెంచగలిగింది. ఆఖర్లో పెనాల్టీ కార్నర్‌ రూపంలో స్కోరు సమం చేసే అవకాశం వచి్చనా... మనవాళ్లు దాన్ని గోల్‌గా మలచలేకపోయారు. గురువారం మరోసారి అర్జెంటీనాతో భారత్‌ తలపడనుంది. 

భారత్‌కు రెండో విజయం
ఆంట్‌వర్ప్‌ (బెల్జియం): యూరోప్‌ పర్యటనలో భారత జూనియర్‌ మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య బెల్జియంపై విజయం సాధించిన భారత అమ్మాయిలు... బుధవారం రెండో మ్యాచ్‌లో 2–1 గోల్స్‌ తేడాతో మరో సారి బెల్జియంపై గెలుపొందారు. భారత్‌ తరఫున లాల్‌థాట్లుయాంగి (35వ నిమిషంలో), గీతా యాదవ్‌ (50వ నిమిషంలో) చెరో గోల్‌ చేశారు. బెల్జియం తరఫున్‌ వాన్‌ హెల్‌మోంట్‌ (48వ నిమిషంలో) ఏకైక గోల్‌ చేసింది. ఈ పర్యటనలో గురువారం భారత్‌ జట్టు చివరి మ్యాచ్‌ ఆడనుంది. 

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)